మెగా బ్రదర్స్ అనగానే మెగా ఫ్యామిలీ హీరోలు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ లే అనుకుంటారు. కాని తమిలంలో సూర్య, కార్తిలను కూడా మెగా బ్రదర్స్ అనే పిలుస్తారు. తమిలంలో ఓకే, తెలుగులో కూడా మేమూ మెగా బ్రదర్స్ లాంటి వారిమే అనిపించుకునేందుకు తెగ తాపత్రయ పడుతున్నారు సూర్య, కార్తీలు. 
 
ఇప్పటికే కార్తి తెలుగులో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. సూర్య కూడా మరో 2 సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తే తెలుగులో డైరెక్టుగా ఎటాక్ చేయడాన్కి కూడా వెనుకాడడు. మరి తెలుగు జనాలపై ఈ తమిళ తంభిలు ఎందుకంత కాన్ఫిడెన్సుగా ఉన్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు. వీరిని చూసి మరి కొందరు తమిళ్ హీరోలు తెలుగులో ఆధిపత్యం చలయించాలని ట్రై చేస్తుంటే, ఇక్కడ మన తెలుగు హీరోలు మాత్రం వీళ్ల పాపులారిటిని చూసి కుల్లుకుంటున్నారు. 
 
రీసెంటుగా జరిగిన సింగం ఆడియో ఫంక్షనులో కూడా మెగా బ్రదర్స్ సింగం సినిమా కంటే ఎక్కువుగా తెలుగు గురించి సంబోదించడం విశేషం. మరీ ముఖ్యంగా సూర్యను తెలుగు హీరోగా చూడమని, తెలుగు ప్రేక్షకులకు సూచించడం విడ్డూరం. అయినా తెలుగు ప్రేక్షకులు కథ నచ్చితే జర్నీలాంటి హీరోలు లేని సినిమాలను కూడా ఆదరించారు. హీరోని చూసి ఇంట్రెస్ట్ పెట్టడం ఒక్క రజినీకాంత్ విషయంలో మాత్రమే తెలుగు ప్రేక్షకులు కన్సిడర్ చేస్తారు. కొన్ని గత చిత్రాల గ్లాప్ రిసల్ట్స్ చూసైనా మెగా బ్రదర్స్ ఆ కాన్ఫిడెన్స్ కాస్త పక్కన పెడితే బాగుంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: