ఒకే కుటుంబం నుంచి వచ్చిన అక్కాచెల్లెళ్ళు హీరోయిన్స్ గా విజయవంతం అయిన సందర్భాలు మన సినిమా పరిశ్రమలో చాలా అరుదు. కాని లక్కీ అండ్ క్రేజీ హీరోయిన్ గా పేరుగాంచిన కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ హీరోయిన్ గా కూడా మంచి మార్కులను తెలుగు ప్రేక్షకుల వద్ద కొట్టేసింది. ఈమధ్య అనుకోకుండా కాజల్ హవా టాలీవుడ్ లో తగ్గిపోయినా కోలీవుడ్ కు టర్న్ తీసుకొని పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు వరసపెట్టి చేస్తోంది కాజల్. చిన్న హీరోల క్రేజీ హీరోయిన్ గా నిషా టాలీవుడ్ సినిమాలలో తన ప్రయత్నం తాను చేస్తూ యూత్ ను బాగానే ఆకట్టుకుంటోంది.

ఇంతవరకూ బాగానే ఉంది కాని ఈమధ్య నిషా అగర్వాల్ తాను ప్రేమలో పడినట్లు తానే స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం ఒక విశేషం. నిషా మాటలతో ఇప్పుడు మీడియా దృష్టి అంతా కాజల్ పై పడింది. చెల్లి ప్రేమలో పడింది కాబట్టి ఇక అక్క కూడా ఎక్కడో అక్కడ ప్రేమ వ్యవహారం నడుపుతూనే ఉండి ఉండవచ్చు అంటూ కాజల్ పై కూడా మీడియా తన ఫోకస్ పెట్టింది. టాలీవుడ్ లో,బాలీవుడ్ లో అవకాశాలు లేకపోవడం కేవలం కోలీవుడ్ మాత్రమే మిగిలిఉండడంతో కాజల్ కూడా తన మనసుకు నచ్చిన ఎవరినో ఒకరిని ప్రేమిస్తేనే మంచిది అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. తన చెల్లెలు నిషా ప్రేమ వ్యవహారం నడుపుతోందన్న విషయం కాజల్ కు షాక్ లా తగిలిందట.

 అంతేకాదు ప్రస్తుత యంగర్ జనరేషన్ ఆలోచనలు తనకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని కాజల్ తన సన్నిహితుల వద్ద అంటోంది అట. ఇంతకీ అప్పుడే కాజల్ అంత పెద్దది అయిపోయిoదా..? తన చెల్లి స్పీడ్ ను కాజల్ యే తట్టుకోలేకపోతుందా...? అనే ఆశ్చర్యం అందరికి కలుగుతోంది. కాని ఈ విషయాలు ఏమి పట్టకుండా కాజల్ మాత్రం ప్రస్తుతం సింగపూర్ లో తన ఫ్రెండ్స్ తో హాలిడే ను ఎంజాయ్ చేస్తోందట. ఇక చెల్లి ఎలాగూ ప్రేమలో పడింది కాబట్టి హాలిడే నుంచి తిరిగి వచ్చాకా కాజల్ కూడా తన ప్రేమ గురించి సీరియస్ గా అలోచిస్తుందేమో......!
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: