హీరో రామ్ చరణ్ అనుకోని చేస్తున్నాడో లేక అనుకోకుండా చేస్తున్నాడో తెలియదు కాని అతడి ప్రవర్తన, వ్యవహార శైలి మీడియా కు ఎప్పుడూ సెంటర్ పాయింట్ గానే వస్తోంది. ఆమధ్య నాయక్ ఆడియో వేడుకలో తమపై వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియా తనకు వెంట్రుకతో సమానం అని సంచలన వ్యాఖ్యలు చేస్తే, ఈమధ్య బంజారాహిల్స్ ప్రాంతంలో కొంతమంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల తో గడవకు దిగి అక్కడా మీడియా కు అడ్డంగా బుక్ అయ్యాడు చిరంజీవి తనయుడు. ఈ వ్యవహారాలూ సర్దుబాటు అయ్యాక, ఈమధ్య తన సినిమాలపై తప్ప మీడియాలో పెద్దగా రామ్ చరణ్ పోకస్ కాలేదు.

నిన్న విశాఖపట్నం లో జరిగిన ఒలింపిక్ డే రన్ కార్యక్రమానికి హాజరు అయిన రామ్ చరణ్ మళ్ళి మీడియా దృష్టిని ఆకర్షించాడు. ఒలింపిక్ డే రన్ కార్యక్రమం ప్రారంభం అయి కొద్ది సేపటికీ వేదికపైకి నేరుగా రామ్ చరణ్ వచ్చేశాడు. అప్పటికే రాష్ట్రం లోని రాజకీయ అతిరధమహారధులు, ముఖ్యమంత్రి తో సహా వేదికపై ఉండడంతో చెర్రీ వరసపెట్టి అందరికి షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు కదిలాడు. అంతవరకూ బాగానే నడిచింది. కాని ఇంతలో ఒక మంత్రి చెర్రీ తన దగ్గరకు వచ్చినప్పుడు లేచి నుంచొని షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇదే సాంప్రదాయం కాబోలు అనుకోని వేదికపై ఉన్న మిగతా మంత్రులూ, ఆఖరుకు ముఖ్యమంత్రి కూడా లేచి నుంచొని రామ్ చరణ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడం అందరి దృష్టిని, ముఖ్యంగా మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షించి, చేర్ర్రి కి ఈ కార్యక్రమంలో ఇంత ప్రాముఖ్యత ఏమిటి ..? అంటూ రకరకాల వార్తలు ప్రసారం చేశాయి. అంతేకాదు వేదికపై ఉన్న రామ్ చరణ్ ను చూడగానే జనం రెచ్చిపోయి ముందుకు రావడం, షరా ప్రకారం పోలీస్ ల లాఠీ చార్జ్ యధావిధిగా జరిగిపోయాయి.

మెగా కుటుంబం పై ప్రస్తుతం మీడియా చూపెడుతున్న ఆశక్తిని చూస్తూ ఉంటే ఎవరికైన ఆశ్చర్యం కలుగుతోంది. మెగా కుటుంబంలోని బేదాబిప్రాయలు, పోరపత్యాలు, వారి సినిమాల పై వార్తలు లేకుండా ఒక్క రోజు కూడా మీడియా కు రోజు గడవకపోవడం చూస్తూ ఉంటే మన మీడియా కు మెగా కుటుంబం పైనా ముఖ్యంగా రామ్ చరణ్ పైన ఎందుకింత ప్రేమ..? అని అనిపిస్తోంది.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: