కె.విజ‌య‌భాస్క‌ర్‌కి చాలా కాలం త‌ర‌వాత ఓ అవకాశం ద‌క్కింది. బోల్‌బ‌చ్చ‌న్ రీమేక్ ద్వారా. ఇద్ద‌రు హీరోలు (వెంక‌టేష్‌, రామ్‌)ల‌తో మ‌ల్టీస్టార‌ర్ తీసే ఛాన్స్ ద‌క్కించుకొన్నాడు. షూటింగ్ అంతా చ‌క‌చ‌క సాగిపోతోంద‌ట‌.  రీమేక్ సినిమా కాబ‌ట్టి పెద్ద‌గా క‌ష్ట‌ప‌డవ‌ల‌సిన అవ‌స‌రం లేక‌పోయింది. సీడీ ముంద‌రేసుకొని మ‌క్కీకి మ‌క్కీ దించేస్తున్నాడ‌ని స‌మాచార‌మ్‌.
ఇప్ప‌టికే 70% షూటింగ్ పూర్త‌యింద‌ట‌. విజ‌య‌భాస్క‌ర్ వేగం చూసి చిత్ర బృందం కూడా స్ట‌న్ అయిపోతోంది. అయితే సొంత ఆలోచ‌న‌లు జోడించ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని ఈ ద‌ర్శ‌కుడు ఈ సినిమాని నెటివిటీ ట‌చ్ ఎలా ఇస్తాడో చూడాలి.

��
త్రివిక్ర‌మ్ దూర‌మ‌య్యాక హిట్ మొహం చూడ‌లేదు విజ‌య భాస్క‌ర్‌. త్రివిక్ర‌మ్ లేక‌పోయినా హిట్టు కొట్ట‌గ‌ల‌న‌ని నిరూపించుకోవ‌డానికి త‌హ‌త‌హ‌లాడుతున్నాడు. అందుకే... సొంత బుర్ర పెట్టి రిస్క్ చేయ‌కుండా మాతృక‌ని య‌థావిథంగా తీయ‌డానికే ఇష్ట‌ప‌డుతున్నాడ‌ట‌. మ‌రి.. బోల్‌బ‌చ్చ‌న్‌లానే ఈ గోల్ మాల్ కూడా హిట్టుకొడితే విజ‌య‌భాస్క‌ర్ కెరీర్ మ‌ళ్లీ గాడిలో ప‌డిన‌ట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: