విత్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అనే క్యాప్ష‌న్‌తో వ‌చ్చిన చిత్రం యాక్ష‌న్‌. రూ.22 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందించిన చిత్ర‌మిది. తొలి రోజు నుంచే ఈ సినిమాకి డివైడ్ టాక్ వినిపించింది. ఫ‌స్ట్ ఆఫ్ బాగానే ఉన్నా - సెకండాఫ్ చాలా స్లోగా ఉంద‌ని విమ‌ర్శ‌కులు పెద‌వి విరిచారు. దాంతో అనిల్ సుంక‌ర అండ్ టీమ్ ఈ చిత్రానికి రీపేర్లు చేసిందట‌.

డ‌ల్ గా న‌డిచిన రెండో భాగానికి క‌త్తిరింపులు వేశారు. ముఖ్యంగా బ్ర‌హ్మానందంపై చిత్రీక‌రించిన స‌న్నివేశాల‌ను, ముఖ్యంగా సినిమా వేగానికి అడ్డుక‌ట్ట వేసిన పోసాని, సునీల్‌ల కామెంట్ల‌నూ ఎడిట్ చేశార‌ట‌. దాంతో సినిమా నిడివి కూడా 15 నిమిషాలు తగ్గింది.

��
రిలీజ్ రోజున చూస్తేనే, సినిమాలో కొన్ని లింకులు త‌ప్పిపోయిన ఫీలింగ్ క‌నిపించింది. అతుకుల బొంత‌... అన్నారు కూడా. ఇప్పుడు మ‌రికొన్ని స‌న్నివేశాలు క‌త్తిరిస్తే - క‌థ అర్థ‌మ‌వుతుందో లేదో? చ‌నిపోయిన పేషెంట్‌కి ఎన్ని ఆప‌రేష‌న్‌లు చేస్తే ఏం లాభం?

మరింత సమాచారం తెలుసుకోండి: