ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చి ప‌దేళ్లు అయినా ఒక్క‌సారి కూడా ఖాకీ క‌ట్ట‌లేదు... అల్లు అర్జున్‌. హైటు కాస్త త‌క్కువ‌నేమో, అలాంటి అవ‌కాశం ద‌ర్శ‌కులు ఇవ్వ‌లేదు. సినిమా మొత్తం ఖాకీలో క‌నిపించ‌క‌పోయినా కాసేపు అయినా ఆ పాత్ర‌లో క‌నిపించాల‌ని ముచ్చ‌ట‌ప‌డి ఉంటాడు. ఇప్పుడు ఆ కోరిక తీర‌బోతోంది. ఎవ‌డులో బ‌న్నీ ఓ గెస్ట్‌రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడు. అదీ.. పోలీస్ గా.

వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్ర‌మిది. ఈ సినిమాలో బ‌న్నీ క‌నిపించేది అయిదు నిమిషాలేన‌ట‌. అయితే ఈ క‌థ‌కు బ‌న్నీ పాత్ర ప్రాణంగా నిలుస్తుంద‌ట‌. బ‌న్నీకి ఓ పాట కూడా ఇచ్చార‌ని స‌మాచార‌మ్‌. అల్లు అర్జున్ ప‌క్క‌న హీరోయిన్ లేక‌పోతే ఎలా??  అందుకే కాజ‌ల్‌నీ అతిథి పాత్ర‌కు ఒప్పించారు.

��
అతిథులు క‌నిపించిన సినిమాలేవీ ఈమ‌ధ్య స‌రిగా ఆడ‌లేదు. సమ్‌థింగ్ స‌మ్‌థింగ్‌లో స‌మంత, రానాలు క‌నిపించారు. యాక్ష‌న్ సినిమాలో సునీల్ గెస్ట్‌రోల్ పోషించాడు. ఈ సినిమాలేవీ ఆడ‌లేదు మ‌రి. క‌నీసం ఎవ‌డు సినిమా అయినా ఈ సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తుందా?

మరింత సమాచారం తెలుసుకోండి: