ఎన్ని సినిమాలు చేసినా త‌గిన గుర్తింపు సంపాదించ‌లేక‌పోయింది అర్చ‌న ఊర‌ఫ్ వేద‌. అయినా సరే - అమె చేతిలో మ‌రో బంగారంలాంటి అవ‌కాశం ఉంది. చాలా కాలం త‌ర‌వాత పూర్తి స్థాయి క‌థానాయిక‌గా క‌నిపించ‌బోతోంది. అందులోనూ వేశ్య పాత్ర‌లో. ఈసారి ఎలాగైనా స‌రే ఛాన్స్ మిస్ చేసుకోకూడ‌దు అని గ‌ట్టిగా డిసైడ్ అయిన‌ట్టుంది. అందుకే రెచ్చిపోతోంది.

అర్చ‌న ప్ర‌ధాన పాత్ర‌లో క‌మ‌ల‌తో నా ప్ర‌యాణం అనే సినిమా తెర‌కెక్కుతోంది. శివాజీ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. 1940 ఒక గ్రామంతో జాతీయ అవార్డు అందుకొన్న న‌ర‌సింహ నంది ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో పాత్ర‌కు అనుగుణంగా అర్చ‌న మ‌రీ హాట్‌గా క‌నిపిస్తోంద‌ట‌. వేశ్య పాత్ర అంటే క‌ష్టాలూ, క‌న్నీళ్లూ, చీక‌టి జీవితాలే కాదు క‌దా?  కావ‌ల్సినంత గ్లామ‌ర్ కూడా ఉంటుంది. అదంతా ఈ సినిమాలో చూపించేస్తోంది.

��
ఈ సినిమాకి సంబంధించిన కొన్ని స్టిల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వాటిలో అర్చ‌నను చూసి ముక్కున వేలేసుకొంటున్నారంతా. మరి సినిమా చూస్తే ఏమైపోతారో?

మరింత సమాచారం తెలుసుకోండి: