ప్యాన్స్‌ను సంపాదించుకోవ‌డం క‌ష్టమే. మ‌రి వాళ్ళ అభిమానాన్ని త‌ట్టుకోవ‌డం కూడ కష్టమే. ఇటువంటి ప‌రిస్థితే బాలీవుడ్ టాప్ హీరోయిన్ క‌రీనాక‌పూర్‌కు ఎదుర‌య్యింది. ఓ ప్రవేట్ ఈవెంట్‌కు అటెండ్ అయిన క‌రీనా క‌పూర్‌, అక్కడ‌నుండి బ‌య‌ట ప‌డటం చాలా క‌ష్టమైంద‌ట‌.

మొద‌ట క‌రీనాక‌పూర్ ఆ ఫంక్షన్‌కు రావ‌టం లేద‌ని, ప్యాన్స్ వెళ్ళిపోయారు. అనుకోకుండా క‌రీనాక‌పూర్ రావ‌డంతో విష‌యం తెలుసుకొని వంద‌ల కొద్ది అభిమానులు క‌రీనాక‌పూర్ వ‌ద్దకు చేరుకున్నారు. అక్కడ‌ బౌన్స్‌ర్లు అంతంగా లేక‌పోవ‌డంతో, క‌రీనా త‌న కారు వ‌ద్దకు చేరుకునే లోపే అభిమానుల మ‌ధ్యలో బాగా న‌లిగిపోయింది. అక్కడ వ‌చ్చిన వాళ్ళంతా క‌రీనా అభిమానులు కావ‌డంతో, వాళ్ళను ఏమి అన‌లేక పోయింది ఈ బెబో.

మరింత సమాచారం తెలుసుకోండి: