అల్లరోడి హీరోయిన్ శ్రద్ధాదాస్‌కి ఆఫ‌ర్లు క‌రువయ్యాయి. టాలీవుడ్ ఎర్లీ ఇన్నింగ్స్‌లోనే అందాల‌ను ఆర‌బోసిన శ్రద్ధాదాస్‌కి అవ‌కాశాలు ఇబ్బడిముబ్బడిగా వ‌చ్చియి. ఈ బ్యూటీ అందాల‌కు పెద్దహీరోలు,డైరెక్టర్లు కూడ క్యూలో నిల‌బ‌డి కాల్షీట్స్ తీసుకున్నారు.

ఏకంగా క్రియోటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్‌లో ఆఫ‌ర్ కొట్టేసి ఇండ‌స్ట్రీకు సెంట్రాప్ ఎట్రాక్షన్ అయింది. మొగుడు మూవీలో గోపీచంద్ స‌ర‌స‌న న‌టించి, అందాల‌ను దాచుకోకుండా మొత్తం చూపించింది. ఆ త‌రువాత మ‌రిన్ని ఆఫ‌ర్లు వ‌స్తాయ‌నుకున్న శ్రద్ధాదాస్‌కు నిరాశే మిగిలింది. ఆ త‌రువాత ఒక్క తెలుగు ఫిల్మ్ కూడ త‌న ముందుకు రాలేదు. అందుకే క‌న్నడ‌, హిందీలో బి గ్రేడ్ మూవీలు చేసుకుంటూ, బ్రేక్ కోసం తెగ క‌ష్టప‌డుతుంది.

జోరు మీద ఉన్నప్పుడు టాలీవుడ్ ఆఫ‌ర్లు ఈ బ్యూటీ వెనుక ప‌డి, ఫాంలో లేన‌ప్పుడు ఈమెను చూసే వాళ్ళే క‌రువ‌య్యారంట‌. అందుకే అప్పుడ‌ప్పుడు స్టేజ్ షోల‌కి ఓకే చెబుతుంది. ఈ మ‌ధ్య యాక్టింగ్ కంటే ఎక్కువుగా స్టేజ్ షోల‌లోనే పెర్ఫార్మెన్స్ ఇస్తుంద‌ట‌. ఆ విధంగానే లేటెస్ట్ ఓ కార్పోరేట్ ఈవెంట్‌లో స్టేజ్‌పై ఐటెం సాంగ్స్‌ను అధ‌ర‌గొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: