తెలుగు స్టోరీల‌ను మ‌రింత హాట్‌గా న‌డిపిన ట్రెండ్, డైరెక్టర్ మారుతి సొంతం. ఈ హాట్ డైలాగ్ వాడ‌దామా, ఈ డ‌బుల్ మీనింగ్ ప్రేక్షకుల‌ను ఇబ్బంది పెడుతుందా.. అని ఆలోచించే వాళ్ళ కంటే చేసి చూపించిన డైరెక్టర్ మారుతి. సిగ్గులేకుండా, నిసిగ్గుగా క‌థ‌లో వేడిని, మాటల్లో రొమాన్స్‌ను చూపించి యువ‌త‌లో త‌నో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాడు.

ఈ రోజుల్లో,బ‌స్‌స్టాప్ మూవీల‌ను యువ‌తను ఉద్దేశించి తీసి, మూవీను లాభాల్లో న‌డిపి, బాక్సాపీస్‌ను షేక్‌చేశాడు. త‌న ప్రతి మూవీలోనూ అమ్మాయిలే హాట్ టాపిక్‌, అమ్మాయిల చుట్టే మాట‌లు,పాట‌లు. హీరో కంటే అమ్మాయిల మెంటాలిటి పైనే ఎక్కువుగా క‌థ‌ల‌ను న‌డిపిస్తుంటాడు. అందుకే త‌న స్టోరీల స‌క్సెస్‌కి గ‌ర్ల్స్ కార‌ణంగా నిలిచారు.

మారుతి ప‌ర్వవేక్షన‌లో వ‌చ్చిన ప్రేమ‌క‌థాచిత్రం కూడ గ్రాండ్ స‌క్సెస్‌ను కొట్టడంతో, మెగా హీరో అల్లుశిరీష్‌తో కొంత జంట అనే మూవీను తెర‌కెక్కించే ప‌నిలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: