సిద్దార్థ్‌కి నోటి దురుసు కుసింత ఎక్కువే. చేతిలో మైకు, ఎదురుగ్గా కెమేరాలు ఉన్నాయి క‌దా.. అని ఏదిప‌డితే అది మాట్లాడేస్తాడు. ఆ మ‌త్తు దిగ‌గానే, నాలిక క‌ర‌చుకొని అయ్యో అనుకొంటాడు. కానీ అప్పటికే చిరిగి చాటంత అవుతుంది. మొన్న ఆమధ్య మీడియాపై అవాకులు, చ‌వాకులూ పేలాడు. పాత్రికేయులంతా స‌రైన గుణ‌పాఠం చెప్ప‌డంతో `సారీ నేను అలా అన‌లేదు` అన్నాడు.

ఇప్పుడు ఏకంగా తెలుగు ప్రేక్ష‌కుల‌నే టార్గెట్ చేశాడు. స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్‌ని హిట్టు చేయ‌లేద‌ని రుస‌రుస‌లాడాడు. 'తెలుగు ప్రేక్ష‌కులు అంతే. వారికి సినిమాలు చూడ‌డం రాదు' అంటూ ఓ రేంజులో మాట్లాడాడు. దాంతో మీడియా మొత్తం సిద్దార్థ్‌ని టార్గెట్ చేసింది. ఏ ధైర్యంతో అంత మాట‌న్నాడు? అంటూ సిద్దార్థ్ పై కారాలూ మిరియాలు నూరింది. మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వెళ్ల‌డం క‌ష్టం అని తెలుసుకొన్న సిద్దార్థ్ ఇప్పుడు స‌డ‌న్‌గా మాట మార్చాడు.

��


''అస‌లు అలాంటి మాట‌లు నేనెందుకు మాట్లాడ‌తా?  తెలుగు ప్రేక్ష‌కులంటే నాకు అపార‌మైన గౌర‌వం. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అక్క‌డ నాకున్న అభిమానుల వ‌ల్లే. నేను న‌డ‌చి వ‌చ్చిన దారిని మ‌ర్చిపోను..'' అంటూ ట్విట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: