అల్ల‌రి న‌రేష్‌కి మినిమం గ్యారెంటీ హీరో అనే ట్యాగ్‌లైన్ కూడా ఉంది. అయితే ఆ క్యాప్షన్‌ చెద‌లు ప‌ట్టే ప్ర‌మాదంలో ప‌డింది. సుడిగాడు మిన‌హా... గ‌త రెండేళ్ల‌లో న‌రేష్ సినిమా ఒక్క‌టీ నిర్మాత‌ల‌కు పెట్టుబ‌డి తీసుకురాలేదు. ఇప్పుడొచ్చిన యాక్ష‌న్ కూడా న‌ష్టాల బాట‌లోనే న‌డుస్తోంది.  దాంతో సుడిగాడు అనిపించుకొన్న న‌రేష్ కాస్త‌... ఐరెన్‌లెగ్‌గా మారిపోతున్నాడు. పైగా సుడిగాడు హిట్ చూసి న‌రేష్ పారితోషికం పెంచేశాడు. అది భ‌రించే స్థోమ‌త చిన్న నిర్మాత‌ల‌కు లేకుండా పోయింది.

ఇప్పుడు కెవ్వుకేక రెడీగా ఉంది. ఈ కేకేదో డీటీఎస్‌ సౌండ్‌లో వినిపిస్తేగానీ న‌రేష్ మ‌ళ్లీ గాడిలో ప‌డేట్టు క‌నిపించ‌డం లేదు. దేవి ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. ఎప్పుడో పూర్త‌యింది. కానీ యాక్ష‌న్ సినిమా విడుద‌లైన త‌ర‌వాత త‌మ కేక వినిపిద్దామ‌ని కాస్త ఆగారు. ఇప్పుడు ఈ సినిమాని బ‌రిలోకి దించ‌బోతున్నారు. ఈనెల 30, న‌రేష్ పుట్టిన రోజు. ఆ సంద‌ర్భంగా కెవ్వుకేక పాటల్ని విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. 

��

బ్లేడు బాబ్జీతో న‌రేష్‌కి ఓ హిట్టు అందించాడు.. దేవి ప్ర‌సాద్‌. ఇప్పుడు వీరిద్ద‌రి సినిమా అంటే అటు ప్రేక్ష‌కుల‌లోనూ, ఇటు ప‌రిశ్ర‌మ వ‌ర్గాలలోనూ ఎంతో కొంత క్రేజ్ ఉంటుంది. పైగా యాక్ష‌న్‌లా భారీ బ‌డ్జెట్ సినిమా కాదిది. న‌రేష్ స్థాయికి త‌గిన బ‌డ్జెట్లో తీశారు. సో... అటు బ‌య్య‌ర్లు, నిర్మాత‌ల‌కూ హ్యాపీనే అన్న‌మాట‌. ఈ కేక కాస్త ప‌వ‌ర్‌ఫుల్‌గా వినిపిస్తే... న‌రేష్ మ‌ళ్లీ గాడిలో ప‌డే అవ‌కాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: