నిన్నటి దాకా కుటుంబ వివాదాలు కోర్టు కేసులు మధ్య నలిగిపోయిన అంజలి వాటినుండి కొద్దిగా తేరుకుని సెటైర్లు వేయడం ప్రారంభించింది. ఆ సెటైర్లు ఎవరి పైనో కాదు ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్న గ్లామర్ హీరోయిన్స్ పైన ఈ మధ్య ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూ లో ఆమె మాట్లాడుతూ సినిమా రంగంలో కొంచం అందం ఉంటే చాలు ఎవరైనా గ్లామర్ డాల్ గా మారచ్చు కానీ నటిగా గుర్తింపు తెచ్చుకోవడం కష్టం అంటూ చాలా పెద్దపెద్ద మాటలు కూడా చెప్పింది.

అంతేకాదు నాలుగు పాటలు రెండు హాట్ సీన్స్ ఉండే రొటీన్ కమర్షియల్ సినిమాలు తన టార్గెట్ కాదనీ తను మొదటి నుంచి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ వచ్చానని చెప్పింది మన తెలుగు సీతమ్మ. కానీ భవిష్యత్ లో గ్లామరస్ చేయనని దానిఅర్ధం కాదని ప్రస్తుతం తన దృష్టి అంతా నటిగా నిరూపించు కోవడానికి ప్రయత్నిస్తున్నానని ఈ కోనసీమ సుందరి మితిమీరిన విశ్వాసంతో చెపుతోంది, ‘క్వీన్ ఆఫ్ టాలీవుడ్’ టైటిల్ కు మీరు పోటీలో లేరా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా మంది క్వీన్స్ ఉన్నారని తను ఆ గుంపులో చేరననీ నటనే తన ప్రాధాన్యత అంటూ చెప్పుకొచ్చింది .

ఇన్ని పెద్ద మాటలు చెప్పిన అంజలి సూర్య హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా ‘సింగం-2’ లో తన శక్తి మేరకు అందాలు ఆరబోస్తూ ఎందుకు ఐటమ్ సాంగ్ చేసింది అన్నది సమాధానం లేని ప్రశ్న. అంతేకాదు తనకు రొటీన్ పాత్రలు చేసిచేసి బోరు కొడుతోందనీ తనకు కూడా గ్లామరస్ పాత్రలలో నటించే చాన్స్ కావాలంటూ హీరోలకు, దర్శకులకు ఫోన్ చేసి మరీ అడుగుతున్న అంజలికి ఈ నీతి వాక్యాలు ఎందుకు....

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: