యంగ్ హీరో సిద్దార్ద్, క్యూట్ గ‌ర్ల్ స‌మంతల ప్రేమ బంధం మూడు ముళ్ల బంధంగా మార‌డానికి స‌మంత మ‌రో స్టెప్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రజెంట్ అత్తారింటికీ దారేదీ సినిమాలో న‌టిస్తున్న స‌మంత త‌న అత్తారింటికీ దారి తెలుసుకుని మరీ వెళ్లి వారిని ప్రస‌న్నం చేసుకుంద‌ట‌. అస‌లు విష‌యం ఏంటంటే హీరో సిద్దు బొమ్మరిల్లు సినిమాలో జెనీలియాను ఇంటికి తీసుకువ‌చ్చి వారిని నీ మాయ‌లో ప‌డేయ‌మ‌ని ఎలా చెప్పాడో, సేమ్ సీన్ స‌మంత‌కు చెప్పాడ‌ట‌.

దీంతో సిద్దుని చాలా సిన్సియ‌ర్ గా ప్రేమిస్తున్న స‌మంత అత‌డి ఇంటికి వెళ్ళి అత్తగారితో తెగ క‌బుర్లు చెప్పింద‌ట‌. సినిమాల‌తో పాటు సిద్దుపై ఎంత ప్రేమ వున్నది....ఎలా ప్రేమ మొద‌లైంది లాంటి విష‌యాలు సినిమా స్టైల్లోనే చెప్పింద‌ట‌. దెబ్బకే ప్లాట్ అయిన అత్తగారు డిసెంబ‌ర్ లో మీ పెళ్లికి మా ప‌ర్మిష‌న్ గ్రాంటెడ్ అన్నార‌ట‌. విశేషం ఏంటంటే ఈ హ్యాపి విజిట్ త‌రువాత సిద్దు ఓ ప్రెస్ మీట్ లోస‌మ్ ధింగ్ స‌మ్ ధింగ్ లో హ‌న్సిక కంటే గెస్ట్ రోల్ చేసిన స‌మంత‌నే బాగా చేసింద‌ని కాంప్లిమెంట్ ఇచ్చాడు.

ఇక సిద్దు ఫ్యామిలీ ప‌ర్మిష‌న్ అందుకున్న స‌మంత ప్రేమ పాట‌లు పాడుకుంటుంద‌ట‌. అంతేకాదు సిద్దుని తన ఇంటికి ర‌మ్మని కోరింద‌ట‌. సో త్వర‌లోనే సిద్దు కూడా అత్తారింటికి వెళ్లి స‌మంత పెరెంట్స్ ని మెప్పించేందుకు రెడీ అవుతున్నాడ‌ట‌. ఏది ఏమైనా డిసెంబ‌ర్ లో జ‌బ‌ర్ధస్త్ గా పెళ్లీ పీట‌లెక్కేందుకు సిద్దు, స‌మంత‌లు ఇప్పటినుండే ప్లాన్ చేస్తున్నార‌ని అర్దమైపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: