యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నాడు. ఏ డైరెక్టర్ అయినా తనకు ఇండస్ట్రీ హిట్ ఇవ్వకపోతాడా అని. డాన్సులు చేస్తాను, డైలాగ్స్ చెబుతాను, ఫైట్స్ చేస్తాను; నెంబర్ వన్ కి కావలసిన వన్నీ నేను చేస్తున్నాను. మరి నాకెందుకు ఇండస్ట్రీ హిట్ తగలడం లేదు, అని ఈ మధ్య ఒకటే ఆలోచిస్తున్నాడంట ఎన్టీఆర్. ఒక్క ఎన్టీఆర్ అనే కాదు, ఇండస్ట్రీ లో పెద్ద హీరోలందరూ ఇదే అలోచిస్తారనుకోండి. కాకపోతే ఆ హీరోలు కొన్నిట్లో మాత్రమే పర్ఫెక్ట్. అన్ని యాంగిల్స్ లోనూ పర్ఫెక్ట్ అయిన అతి కొద్ది మంది హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. అలాంటి ఎన్టీఆరుకి ఎందుకు ఇండస్ట్రీ హిట్ రావడం లేదో నిజంగా ఆలోచించాల్సిన విషయమే.


ఎన్టీఆరుకి కథల మీద పట్టు చాలా తక్కువ. అంతకుముందు ఏ హీరోతోనైనా హిట్ ఇచ్చాడు అని తెలిస్తే చాలు సినిమా చేసేద్దాం అంటూ కలుపుకుపోతున్నాడు కాని కధేంటి. అందులో ఫ్యాన్సుకి కావలసిన మసాలాలు ఉన్నాయా, ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నాయా, యూత్ కి, అలాగే పిల్లలకి అలా అన్ని యాంగిల్స్ చూడకుండా డైరెక్టరుని గుడ్డిగా నమ్మి సినిమా ఒప్పుకుంటున్నాడు.


అంతే కాదు ఈ మధ్య ఎన్టీఆరుకి ఏదైనా కొత్త లుక్ చూపిస్తే చాలు సినిమా చేసేద్దాం అంటూ డైరెక్టరుకి మాటిస్తున్నాడంట. అయినా ఎన్టీఆర్ నీకు కావలసిన లుక్ చూసుకుంటున్నావ్ సరే ప్రేక్షకులకు కావలసిన కిక్ గురించి కూడా కాస్త ఆలోచించు. నీ లుక్కుకి ప్రేక్షకుల కిక్కు తోడైతేనే వస్తుంది ఇండస్ట్రీలో నీవనుకున్న లక్కు.

మరింత సమాచారం తెలుసుకోండి: