మెగా ఫ్యామిలీ అనే పేరు రావడానికి మెగాస్టార్ చిరంజీవి ప్రమేయం ఎంత ఉందో, దీని వెనుక మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాస్టర్ మైండ్ కూడా అంతే ఉందని మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు అందరూ ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోవడమే కాదు పబ్లిగ్గా చెబుతుంటారు కూడా! ఆలాంటి మాస్టర్ మైండ్ ఉన్న వ్యక్తితో డైరెక్టర్ మారుతిని పోల్చుతున్నారు ఇండస్ట్రీలో సినీ జనం.
 
  
ప్రజెంట్ మారుతి ట్రెండ్ ఎలా నడుస్తుందో తెలిసిందే. ఎక్కడ చూసినా మారుతీనే. బయట వారి సినిమాల ఆడియో ఫంక్షన్, ప్లాటినం డిస్క్, ప్రెస్ మీట్ ఇలా ఎక్కడ చూసినా మారుతి కనిపిస్తూనే ఉన్నాడు. మరి ఇంత పాపులారిటి రావడానికి కారణం నిజంగా మారుతి మాస్టర్ మైండే అని ఒప్పుకుని తీరాలి. లేదంటే చేసిన 2 సినిమాలతోనే ఇంత పాపులారిటి వచ్చేస్తుందా?
 
 
పక్కా ప్రణాళిక, పట్టుదల ఉండబట్టే మారుతి అతి తక్కువ టైంలో అతి ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ కృషి వెనుక మారుతి కష్టం చాలా ఉందని రీసెంటుగా ప్రేమ కథా చిత్రమ్ ప్లాటినం ఫంక్షన్లో ఆయన మాటలను బట్టి తెలుసుకోవచ్చు.  అయినా  ఫ్రీగా ఏది రాదు. ఒకవేళ వచ్చినా ఎంత సేపో ఉండదు. అల్లు అరవిందులాంటి మాస్టర్ మైండుతో మారుతిని పోల్చడం సరైనదో కాదో మారుతి చేయనున్న మరో రెండు సినిమాలతో తెలిసిపోతుంది. ఏమంటారు??

మరింత సమాచారం తెలుసుకోండి: