ఎందుకో గాని హీరో సిద్ధార్థ్, తనలో కావాల్సినంత టాలెంట్ ఉన్నా దానిని వాడుకోవడంలో అంతగా సక్సెస్ కాలేకపోతున్నాడనిపిస్తుంది. అందులో మళ్ళీ ఆయనకున్న నోటి దూల కూడా ఆ టాలెంటుని కప్పేస్తుందేమో అనే అనుమానం కూడా కొందరికి ఈ మద్య కలుగుతోంది. లేదంటే చక్కగా ‘సంథింగ్ సంథింగ్’ సినిమా హిట్ టాకుతో నడుస్తుంటే, కావాలని చేసాడో లేక తన సినిమాకి పబ్లిసిటి వస్తుందని వాగాడో తెలియదు కాని మొన్న చెన్నైలో అయన చేసిన కామెంట్స్ మరో సారి దుమారం లేపాయి.
 

 ఆ  కామెంట్స్ తెలుగు ప్రేక్షకుల పై కావడంతో, ఇప్పటికే ఓ సారి మీడియా ఆగ్రహానికి గురై తగిన మూల్యం చెల్లించుకున్న సిద్ధార్థ్ వెంటనే కవర్ చేసుకునే ప్రయత్నం ట్విట్టర్ రూపంలో చేయబోయాడు. ముందు ఏది పడితే అది మాట్లాడటం, తర్వాత సారీ చెప్పడం సిద్దుకి అలవాటు అయిపోయింది. అయితే ఈ సారి అతను ఎంత నాలుక తిప్పే ప్రయత్నం చేసినా తెలుగు ప్రేక్షకులు మాత్రం అతనికి గట్టిగా బుద్ది చెప్పాలని డిసైడ్ అయ్యారు.
 

అయినా చెన్నై పత్రికలు నేను మాట్లాడిన దాన్ని వక్రీకరించి రాసాయి అని సిద్ధార్థ్ నాలుక తిప్పడానికి ట్రై చేస్తే, అతను మాట్లాడిన వీడియోలో సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులను ఎలా తీసిపడేసాడో క్లియరుగా ఉంది. సో నువ్ ఎంత నేర్పరిగా నాలుక తిప్పాలన్నా సిద్ధూ నీ పప్పులుడకవ్. నీకున్న నోటిదూల నిన్ను అడ్డంగా బుక్ చేసింది. ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో నీ తరువాతి తెలుగు మూవీకి తెలుస్తుంది. అప్పటివరకు నాలుక మదతేసుకొని ఉంచుకో!

మరింత సమాచారం తెలుసుకోండి: