మాస్ మహారాజ యూటర్న్ తీసుకుంటున్నాడా? ఇప్పుడిదే ఆ శక్తికర చర్చ టాలీవుడ్ లో జరుగుతోంది. ప్రస్తుతం తనకు   హీరోగా పని అయిపోందని అనుకుంటున్నాడో ఏమో కానీ హీరో రవితేజ దర్శకత్వంపై దృష్టి సారించాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఇతడి సినిమా 'బలుపు' విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో  అనుకున్న విధంగా ఈ సినిమా హిట్ కాకపోతే రవితేజ పరిస్థితి ఏమిటి అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ఫెయిలయినా రవితేజా  పెద్దగా పోగొట్టుకునేది ఏమీ లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఎందుకంటే ఇప్పటికే రవితేజ ఎన్నో ఫెయిల్యూర్స్ ను చూసాడు  అలాంటి వాటిల్లో ఇదీ ఒకటవుతుంది తప్ప పెద్దగా ఇబ్బందేమీ ఉండదని వీరివాదన. ఈ అంచనాలను బట్టి ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాఎబోవ్ యావరేజ్ అవుతుంది కానీ సూపర్ హిట్ అయ్యే పరిస్థితులు లేవంటున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ ఇచ్చిన ఇంటర్వ్యూల ప్రకారం చూస్తే ఆయన కు కూడా ఈ పరిస్థితి తెలుసుననీ అందుకే ఎందుకైనా మంచిదని  దర్శకత్వంపై మక్కువ చూపిస్తున్నాడని అంటున్నారు.  నిర్మాతగా మారడం గురించి మాట్లాడుతూ తనకు  సినీ నిర్మాణం ఏమాత్రం ఆసక్తి లేదని, అయితే వేరే వాళ్లసినిమాలకు  డైరెక్ట్ చేయడానికి తనకు ఉత్సాహం ఉందని రవితేజ చెప్పాడు.

 సహాయ దర్శకుడిగానే కెరీర్ ఆరంభించిన రవితేజ, హీరోగా ప్రస్థానం ముగించాక దర్శకత్వంవైపు అడుగులు వేసే ఉద్దేశంతో ఉన్నాడని అనుకోవాలా లేక ఎందుకైనా మంచిదని తన కెరియర్ ను దృష్టిలో పెట్టుకుని తనకు తానే యూటర్న్ తీసుకుంటున్నాడ అన్న విషయం ‘బలుపు’ రిజల్ట్ ను బట్టి ఆధారపడి ఉంటుంది.....

మరింత సమాచారం తెలుసుకోండి: