యాంక‌ర్ గా అద‌ర‌గొట్టి ఆ త‌రువాత న‌టిగా, ఐటం గ‌ర్ల్ గా తెలుగు నాట ఎంత పేరు తెచ్చుకున్న ఉద‌య‌భాను ఇక రాజ‌కీయాల్లో త‌న స‌త్తా చాటాల‌నుకుంటుంద‌ట‌. అనుకోవ‌డమే కాదు వ‌చ్చే ఎల‌క్షన్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటుంది.

క‌రీంన‌గ‌ర్ లోని కోహెడ మండ‌లం ఉద‌య‌భాను స్వస్ధలం. గతంలో ఆమె కుటుంబానికి రాజ‌కీయాల‌తో అనుబంధం వుంది. ఆమె తండ్రి మొయినుద్దీన్ వ‌రుస‌గా మూడు సార్లు స‌ర్పంచ్ గా కమ్యూనిస్ట్ పార్టీ త‌రుపున పనిచేశారు . 1987లో తండ్రి చ‌నిపోవ‌డంతో ఉద‌య‌భాను కుటుంబంతో స‌హా హైద‌రాబాద్ వ‌చ్చేసింది. రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు. అలా ఇక్కడ అడుగుపెట్టిన ఉద‌య‌భాను యాంక‌ర్ గా కెరీర్ మొదలెట్టి అంచ‌లంచెలుగా ఎదిగింది. అయితే తాజాగా ఆమె బిజెపీ పార్టి త‌రపున హుస్నాబాద్ నియోజ‌క వ‌ర్గం నుండి పోటీలో దిగ‌బోతుంద‌ని కొద్దిమంది చెప్పుకుంటున్నారు.

నిజానికి 2009 ఎల‌క్షన్స్ లోనూ ఉద‌య‌భాను పోటీ చేయ‌బోతుంద‌ని ప్రచారం జ‌రిగింది. కానీ అదెందుకో కార్యరూపం దాల్చలేదు. మ‌రి ఈసారి ఎల‌క్షన్స్ లో నిల‌బ‌డి ఉద‌యభాను గెల‌వ‌గ‌ల‌దో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: