జులై 19.. ఇప్పుడీ తారీఖు గురించి శ్రుతిహాస‌న్ చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే త‌ను న‌టించిన రెండు బాలీవుడ్ సినిమాలు ఆరోజే విడుద‌ల కానున్నాయి. బాలీవుడ్‌లో అవ‌కాశం రావ‌డ‌మే గొప్ప‌. అందులోనూ వ‌రుస‌గా రెండు సినిమాల్లోనూ. రెండూ ఒకేరోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తే ఎలా ఉంటుంది?  ప్ర‌స్తుతం ఆ అనుభూతిలో ఉంది క‌మ‌ల్ కూతురు.

శ్రుతి న‌టించిన డీ డే, రామ‌య్యా వ‌స్తావ‌య్యా సినిమాలు జులై 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. అందుకే శ్రుతి చాలా ఎగ్జెట్ అవుతోంది. ''రెండూ భిన్న‌మైన చిత్రాలే. ఒక సినిమాలో చాలా సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా న‌టిస్తే, రెండోది పూర్తిగా ఆపోజిట్‌. ఓ న‌టిగా రెండు పాత్ర‌లూ ఛాలెంజింగ్‌గా అనిపించాయి. ఆ రోజు ముందు ఏ సినిమా చూడాలి? అనే నేనే క‌న్‌ఫ్యూజ‌న్‌లో ఉన్నా...'' అని సంతోష‌ప‌డిపోతోంది.

��
డీ డేలో హాట్ గా క‌నిపించార‌ట‌...?  అని అడిగితే ``పాత్ర ప‌రిధి మేర‌కు న‌టించాలి. చేసేది వేశ్య పాత్ర‌. ఆ మాత్రం హాట్‌గా లేక‌పోతే ఎలా?`` అని ఎదురు ప్ర‌శ్నిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: