వ‌రుస ఫ్లాప్‌ల‌తో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు ర‌వితేజ‌. బ‌లుపుతో ఎలాగైనా హిట్ కొట్టాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. సినిమాలో త‌న ఎఫెక్ట్ అంతా చూపించేశాడు. ఇక మిగిలిన భారం దేవుడిపై వేశాడు. బ‌లుపు సినిమాని హిట్ చేయించాల‌ని దేవుడికి మొక్కుకొన్నాడ‌ట ర‌వితేజ‌. అంతేకాదు విడుద‌ల రోజున ప‌దివేల కొబ్బ‌రి కాయ‌లు కొడ‌తా.. అని ఒట్టు వేసుకొన్నాడ‌ట‌.

ర‌వితేజ ఇంటి ముందు కూడా భారీ సంఖ్య‌లో కొబ్బరికాయ‌లు పోగేశార‌ట‌. ఇదే విష‌యం ర‌వితేజ‌ని అడిగితే ''అబ్బే... అలాంటిదేం లేదండీ. అన్ని కొబ్బ‌రికాయ‌లు ఎందుకు కొడ‌తా...'' అని కామెడీగా న‌వ్వేస్తున్నాడు. అయితే ఈ కొబ్బ‌రికాయ‌ల మొక్కు మాత్రం నిజ‌మే అని ర‌వితేజ స‌న్నిహితులు చెబుతున్నారు.

��

మొత్తానికి ర‌వితేజ దేవుడిని కాకా ప‌ట్టేస్తున్నాడ‌న్న‌మాట‌. చూస్తుంటే... ఖ‌డ్గంలోని గోవిందా గోవిందా పాట గుర్తొస్తుంది క‌దా? అందులో దేవుడిని చిత్ర విచిత్ర‌మైన కోరిక‌లు కోరుకొని ఆఖరికి ఆయ‌న్నే పారిపోయేలా చేస్తాడు. ఇప్పుడు ర‌వితేజ దెబ్బ‌కు నిజంగానే దేవుడు మాయ‌మైపోతాడా?

మరింత సమాచారం తెలుసుకోండి: