తెలుగు సినిమాల్లో విల‌న్ అంటే.. ఏ బ్యాంకాక్ నుంచో, మ‌లేసియా నుంచో ఊడిప‌డాల్సిందే. అందుకే ముంబై నుంచి కావ‌ల్సిన న‌టుల‌ను దిగుమ‌తి చేసుకొంటుంటారు. లోక‌ల్ టాలెంట్‌ని మాత్రం వాడుకోరు. ప్ర‌కాష్‌రాజ్ లాంటివాళ్లను ఎంత కాలం చూడాలి?  అన్న‌ది వారి ప్ర‌శ్న‌. అయితే యంగ్ హీరోల‌కూ, సీనియ‌ర్ హీరోల‌కూ ఒక్క‌డే విల‌న్ కావ‌డం రోత పుట్టిస్తోంది.

అయితే ఈసారి ఎన్టీఆర్‌కి మాత్రం కొత్త విల‌న్ దొరికాడు.ఎన్టీఆర్ -హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం రామ‌య్యా వ‌స్తావ‌య్యా. ఇందులో ఎన్టీఆర్‌తో పోటీ ప‌డేది ఎవ‌రో తెలుసా??  సాయికుమార్ త‌మ్ముడు ర‌విశంక‌ర్‌. ఢ‌మ‌రుకం సినిమాలో విల‌న్ పాత్ర పోషించి అంద‌రికీ భ‌య‌పెట్టాడు. ఆ సినిమా అంత‌గా ఆడ‌క‌పోయినా,

ర‌వి పాత్ర‌కు మంచి మార్కులే ద‌క్కాయి. ఆ సినిమాతో ఇప్పుడు రామయ్యా వ‌స్తావ‌య్యాలో ఎన్టీఆర్‌తో ఢీ కొట్టేలా చేసింది.ఈ సినిమాలో ఎన్టీఆర్ కాలేజీ స్టూడెంట్‌లా క‌నిపించ‌నున్నాడు. మ‌రి.. విల‌న్ ర‌వి శంక‌ర్ పాత్ర ఏ త‌ర‌హాలో తీర్చిదిద్దారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: