చేసింది ఒకే ఒక్క సినిమా, కాని టాలీవుడ్‌లో బ్లాక్‌బ‌స్టర్ మూవీగా నిలిచింది. గ‌బ్బర్‌సింగ్‌తో టాప్ పొజిష‌న్‌కు వెళ్లిన డైరెక్టర్ హ‌రీష్‌శంక‌ర్‌. ఇక నుండి త‌న మూవీలో తెలుగు ఆర్టిస్ట్‌ల‌కే ప్రాధాన్యం ఇస్తాన‌ని త‌నదైన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. త‌న లేటెస్ట్ ఫిల్మ్ రామ‌య్యా..వ‌స్తావ‌య్యా. షూటింగ్ గాప్‌లో ఓ లీడింగ్ టాబ్లాయిడ్‌కు ఇచ్చిన ఇంట‌ర్వూ ప్రకారం ఈ మాట అన్నాడు.

కారణం ఏంట‌ని అడిగితే, 'లాంగ్వేజ్ రాని ఆర్టిష్టుల‌చే చాలా ఇబ్బందులు ప‌డ్డాను. డైలాగ్‌లు క‌రెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయ‌రు'. అంటూ నాన్ తెలుగు ఆర్టిస్ట్‌ల‌పై డెరెక్ట్‌గానే ఎటాక్ ఇచ్చాడు. విష‌యంలోకి వెళితే, త‌న మొద‌టి మూవీ గ‌బ్బర్‌సింగ్‌లోని విల‌న్ అభిమ‌న్యు సింగ్ అలియాస్ బుక్కారెడ్డిగా ర‌క్తచ‌రిత్ర మూవీతో టాలీవుడ్‌లో చొర‌బ‌డిన నాన్‌తెలుగు ఆర్టిస్ట్.

ఈ విల‌న్ గ‌బ్బర్‌సింగ్ మూవీలోనూ మెయిన్ విల‌న్‌గా న‌టించాడు. ఈ అభిమ‌న్యుసింగ్‌తో హ‌రీష్‌శంక‌ర్ చాలా ఇబ్బందులు ప‌డ్డాడంట‌. అంతే కాకుండ ఒకానొక సంద‌ర్భంలో అబిమ‌న్యు సింగ్‌ను ఏమిచేయ‌లేని ప‌రిస్థితిగా స‌మ‌స్య ఏర్పడింది. అందుకే త‌న సెకండ్ ఫిల్మ్‌లో ఇటువంటి స‌మ‌స్యలు చోటుచేసుకోకుండా ఎక్కువుగా తెలుగు ఆర్టిస్ట్‌ల‌చేతే మూవీను ఫినిష్ చేస్తున్నాడు. ఇక నుండి త‌న త‌రువాత ఫిల్మ్స్‌లో కూడ తెలుగు ఆర్టిస్ట్‌ల‌కే ప్రాధాన్యత ఉంటుంది చెప్పుకున్నాడు. రామ‌య్యా.వ‌స్తావ‌య్యా మూవీ కాస్టింగ్ ఎంపిక జ‌రుగుతున్నప్పుడు అభిమ‌న్యుసింగ్ కాల్ చేసినా, హ‌రీష్‌శంక‌ర్ రెస్పాండ్ కాలేద‌ని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: