అమీర్‌ఖాన్ నెగిటివ్ రోల్‌గా వ‌స్తున్న చిత్రం ధూమ్‌-3. ఈ మూవీకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ఇండియాలో జ‌రుగుతుంది. అమీర్‌ఖాన్‌కు స‌బంధించిన కొన్ని యాక్షన్ సీన్లను ఇండోర్‌లో షూట్ చేస్తున్నారంట‌.

యాష్‌రాజ్ ఫిల్మ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రొడ‌క్షన్ వాల్యూస్ కూడ రిచ్‌గానే ఉంటాయి. అయితే అమీర్‌ఖాన్ మాత్రం ఇంటి నుండి వ‌చ్చిన ఫుడ్‌ను మాత్రమే తింటున్నాడు. యూనిట్ అంతా ప్రొడ‌క్షన్ ఫుడ్ తింటుంటే, అమీర్‌ఖాన్ ఇంటి ఫుడ్ తింటున్నారు. అంద‌రూ అమీర్‌ఖాన్‌ని అదోలా చూడ‌టంతో ఎందుకులే అని త‌రువాతి రోజు అమీర్‌ఖాన్ త‌న ఇంటి నుండే అంద‌రికి బిర్యానిను వండిచ్చి తీసుకువ‌చ్చాడంట‌.

ఆ బిర్యాని వండింది ఎవ‌రో కాదు, స్వయాన అమీర్‌ఖాన్ అమ్మగారు. ఈ సీన్ అంతా నిన్న జ‌రిగిన ధూమ్‌-3 షూటింగ్‌లో జ‌రిగింది. ఈ మూవీ ను ఈ సంవ‌త్సరం చివ‌రిలో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: