మా సినిమా బాగుంటుంది, పాట‌లుంటాయ్‌, కామెడీ ఉంటుంది, యాక్ష‌న్ ఉంటుంది అని చెప్పుకోవ‌డం పాత ప‌ద్ధ‌తి. మారుతి సినిమాల‌కు మాత్రం అలా కాదు. మా సినిమాలో బూతు ఉండ‌దు.... అని ముంద‌స్తు ప్ర‌చారం చేసుకోవ‌ల‌సి వ‌స్తోంది. మారుతి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న రొమాన్స్ విష‌యంలోనూ అదే జ‌రుగుతోంది. ఈ సినిమాతో డార్లింగ్ స్వామీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

రొమాన్స్ పోస్ట‌ర్లు చూసి ఇందులో బూతు ఉందేమో అనుకొంటున్నారు. డ‌బుల్ మీనింగ్ డైలాగులు ఉంటాయి.. అనుకొంటున్నారు. అలాంటివేం ఉండ‌వు. అయితే నేటి త‌రం బ‌య‌ట ఏం మాట్లాడుకొంటుందో అదే ఉంటుందీ సినిమాలో. దాన్ని బూతులా అర్థం చేసుకోకూడ‌దు. కొన్ని సంద‌ర్భాల్లో బూతు ఉన్నా - దాని వెనుక మంచి అర్థం ఉంటుంద‌. - అంటూ త‌లా తోకా లేకుండా మాట్లాడేశాడు డార్లింగ్ స్వామి. అంటే ఈ సినిమాలో బూతు ఉన్నా, అది బూతుగా తీసుకోకూడ‌ద‌న్న‌మాట‌.

��  
ఈ సినిమాలో మారుతి పెట్టుబ‌డి ఏం పెట్ట‌లేదు. కానీ మారుతి పేరు చెప్పి.... గుడ్ ఫ్రెండ్స్ సంస్థ సొమ్ము చేసుకొంటోంది. అయితే త‌న పేరు వాడుకొంటున్నందుకు.... మారుతికి వాటా కూడా ఇచ్చార‌ట‌. ఈ యాపారం ఏదో బాగుందే.

మరింత సమాచారం తెలుసుకోండి: