రాజకీయాలు, సినిమాలు, మీడియా ఇలా ఈ మూడు రంగాలు ఒకదానితో ఒకటి అనుసంధానం అయి పోతూ సామాన్య మానవుడిపై తమ ప్రభావాన్ని చూపెడుతున్నాయి. ఈ మూడు రంగాలలోనూ పేరుతొ పాటు సంపాదన కూడా కోట్లాది రూపాయలుగా ఉండడంతో ఈ రంగాలలోని ప్రముఖులు ఒక రంగం నుండి మరొక రంగం వైపు చిన్నపిల్లలు ఆడుకొనే మ్యూజికల్ చైర్స్ లా తమ స్థానాలను మార్చేసుకుంటున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఫిల్మ్, టీవీ సెలబ్రిటీలు తమ పార్టీలలో ఉంటే ప్రచారానికి పనికివస్తారు, ఎంతో కొంత ఓట్ల రూపంలో కూడా వారి గ్లామర్ తో రాబట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని పార్టీలు వారి వారి శక్తి మేరకు ఫిల్మ్, టీవీ సెలబ్రిటీలపై వల వేసి తమ పార్టీలలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

టీవీ న్యూస్ రీడర్ గా పేరుగాంచిన రాణి రుద్రమ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా రాబోతున్న అసెంబ్లీ ఎన్నికలలో ఆమెను ఎమ్యెల్యే గా పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం బుల్లితెర యాంకర్ లలో హాట్ యాంకర్ గా పేరుగాంచిన ఉదయభాను ను బిజెపి పార్టీ తరపున పోటీ చేయి౦చాలని ఆ పార్టీ భావిస్తోందట. రాజకీయ నేపధ్యం కల కుటుంబం నుంచి వచ్చిన ఉదయభాను తండ్రి కరీంనగర్ జిల్లాలోని కోహేడా మండలానికి వరసగా మూడు సార్లు సర్పంచ్ గా పనిచేశారట. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉదయభాను తండ్రి కి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయట. ఉదయభాను గ్లామర్, ఆమె తండ్రి రాజకీయ నేపధ్యంతో ఉదయభాను ను కరీంనగర్ నుండి ఎమ్యెల్యే గా పోటీ చేయిస్తే బిజెపి కి మంచి అవకాశాలు ఉంటాయని ఆ పార్టీ భావన అట.

అంతేకాకుండా ఉదయభాను గ్లామర్, ఆమె మాటల చాకచక్యం ఎన్నికల ప్రచారానికి చక్కగా సరిపోతాయని బిజెపి ఆలోచన అని అంటున్నారు. ఇప్పటికే రకరకాల రియాలిటీ షో లతో పాటు కొన్ని సినిమాలలో ఉదయభాను నటించడమే కాకుండా, ఒక హాట్ యాంకర్ గా మంచి పేరు ఉంది. ఈమధ్య నే ఈమె నటిస్తున్న “మధుమతి” సినిమాలోని హాట్ స్టిల్స్ మీడియా, వెబ్ సైట్స్ లలో హడావుడి చేస్తూ, ఉదయభాను ఇప్పటికీ హాట్ యే గురూ...! అని అనిపించేటట్లుగా చేస్తున్నాయి. మరి దీనికి ఉదయభాను ఏమంటుందో చూడాలి. పవర్ స్టార్ లాంటి హీరోలు ఐటమ్ సాంగ్ కు యాంకర్ అనసూయ యే కావాలి అని అడుగుతూ ఉండడం, జాతీయ స్థాయి పార్టీ గా పేరుగాంచిన బిజెపి లాంటి పార్టీలు ఉదయభాను తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం చూస్తూ ఉంటే బుల్లితెర హాట్ యాంకర్ లకు ఇంత డిమాండ్ ఉందా...? అని అనిపిస్తోంది.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: