అక్కినేని నాగేశ్వ‌ర‌రావు కెరీర్‌లోనే కాదు, యావ‌త్ తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే ఓ క్లాసిక్ దేవ‌దాసు. బెంగాలీ ర‌చ‌యిత శ‌ర‌త్ ర‌చించిన న‌వ‌ల‌కు వెండితెర రూపం ఈ సినిమా. నృత్య‌ద‌ర్శ‌కుడు వేదాంతం రాఘ‌వ‌య్య మెగాఫోన్ ప‌ట్టి, ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. పార్వ‌తి పాత్ర‌లో మ‌హాన‌టి సావిత్రి న‌టించింది. ఈ సినిమా విడుద‌లై 2013 జూన్ 26 నాటికి స‌రిగ్గా 60 ఏళ్లు. అంటే... మ‌న దేవ‌దాసు ష‌ష్టిపూర్తి చేసుకొంటున్నాడ‌న్న‌మాట‌.

దేవ‌దాసు అన‌గానే అద్భుత‌మైన పాట‌లే గుర్తొస్తాయి. మరీ ముఖ్యంగా విషాద గీతాలు. జ‌గ‌మే మాయ‌, బ‌తుకే మాయ‌... వేదాల‌లో సార‌మింతేన‌యా - అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా లాంటి సూప‌ర్ హిట్ గీతాలు ఈ సినిమాలోనివే. ప్రేమ‌లో విఫ‌ల‌మై తాగుడుగు బానిసైన ప్రేమికుడిగా అక్కినేని న‌ట‌న‌... న‌భూతో న భ‌విష్య‌త్‌. ఈ సినిమా బ‌డ్జెట్ ఎంతో తెలుసా?  రూ.5 ల‌క్ష‌ల లోపే. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో నిర్మించారు. రెండు చోట్లా అఖండ‌మైన విజ‌యం సాధించింది. 

��
దేవ‌దాసు న‌వ‌ల ఆధారంగా దేశం మొత్తంలో 12 సినిమాలొచ్చాయి. వాటిలో అగ్ర‌తాంబూలం అక్కినేని దేవ‌దాసుదే. దిలీప్‌కుమార్‌లాంటి మ‌హాన‌టుడు బాలీవుడ్‌లో దేవ‌దాసు చిత్రాన్ని తీశాడు. ఆయ‌న ఓ మాట‌న్నారు.  ''అక్కినేని దేవ‌దాసు సినిమా చూసుంటే, నేను ఈ సినిమాని తీసేవాడిని కాదు.. '' అని. అదీ... ఈ దేవ‌దాసు గొప్ప‌ద‌నం.

మరింత సమాచారం తెలుసుకోండి: