బెల్లం ఎక్క‌డుంటే ఈగ‌లు అక్క‌డ ముసురుకోవ‌డం చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కామ‌నే. ఓ విజ‌యం ద‌క్క‌గానే అత‌ని వెంట పొలోమ‌ని ప‌డ‌తారు. అలాంటిది వరుస‌గా మూడు హిట్లు కొడితే ఆగుతారా? క‌ర్చీప్‌ల మీద క‌ర్చీఫ్ లు వేసెయ్యరూ. మారుతి విష‌యంలోనూ అదే జరుగుతోంది. ఈరోజుల్లో, బ‌స్‌స్టాప్‌, ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ ల‌తో పరిశ్ర‌మ‌ను ఆక‌ట్టుకొన్నాడు మారుతి. ఇప్పుడు అత‌నితో సినిమాలు చేయాల‌ని బ‌డా నిర్మాతలు, హీరోలూ ఎదురుచూస్తున్నారు. ఆ లిస్టులో ఇప్పుడు బ‌న్నీ కూడా చేరిపోయాడు.

అల్లు శిరీష్-మారుతి కాంబినేష‌న్‌లో కొత్త‌జంట అనే సినిమా తెర‌కెక్కుతోంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోంది. మారుతి టాలెంట్‌ని ద‌గ్గ‌రుండి చూసిన అల్లు అర‌వింద్‌....మారుతికి ఇప్పుడు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడ‌ట‌. బ‌న్నీతో కూడా ఓ సినిమా చేసి పెట్టు అని ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చాడ‌ట. దాంతో ఎగిరి గంతేశాడు మారుతి. మెగా ఫ్యామిలీతో మంచి రిలేష‌న్ ఉంది మారుతికి. వాళ్లేంటో మారుతికి, మారుతి గురించి మెగా ఫ్యామిలీకి బాగా తెలుసు. అందుకే ఈ ప్రాజెక్టు ఇలా, ఇంత తొంద‌ర‌గా ఓకే అయిపోయింది.

��


మారుతిపై బూతు ముద్ర ప‌డిపోయింది. ఈరోజుల్లో, బ‌స్‌స్టాప్ సినిమాల్లానే బ‌న్నీ సినిమా కూడా తీస్తానంటే కుద‌ర‌దు. ప‌ద్ధ‌తి మార్చాల్సిందే. మ‌రి మారుతి అందుకు సిద్ధ‌మేనా?  ఓ క్లీన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించే స‌త్తా ఈ బూతు ద‌ర్శ‌కుడికి ఉందా?  అది కాల‌మే తేల్చాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: