మెగా కుటుంబంలోంచి వ‌చ్చి, హీరో అవ్వ‌కుండా సైడ్ క్యారెక్ట‌ర్ల‌తో సంతృప్తి ప‌డిపోయాడు నాగ‌బాబు. చంద‌మామ లాంటి సినిమాల్లో నాగ‌బాబు న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది. ఆ స్థాయిలో గుర్తిండిపోయే క్యారెక్ట‌ర్ ఆయ‌న‌కు ఈమ‌ద్య ప‌డ‌లేదు. తాజాగా 1000 అబ‌ద్ధాలు సినిమాలో నాగ‌బాబుకి అదిరిపోయే క్యారెక్ట‌ర్ ప‌డింద‌ట‌. ఈ సినిమాతో నాగ‌బాబు పేరు మార్మోగిపోవ‌డం ఖాయం అని ఆ చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇందులో నాగ‌బాబు ఓ రొమాంటిక్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నాడు. వ‌య‌సు మీద ప‌డినా మేక‌ప్పుల‌తో క‌వ‌ర్‌చేసి, పూల చొక్కాలేసి, హీరోయిన్ కి లైన్‌వేసే క్యారెక్ట‌ర్ ఆయ‌న‌ది. పేరేంటో తెలుసా..?  ట‌వ‌ర్ స్టార్‌. ఫ్యాన్ ఆఫ్ ప‌వ‌ర్ స్టార్ అట‌. ప‌వ‌ర్ స్టార్ అంటే త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. త‌మ్ముడంటే నాగ‌బాబు అన్న‌య్య‌కు వ‌ల్ల‌మాలిన ప్రేమ‌. అది ఈ రూపంలో చూపించుకొన్నాడ‌న్న‌మాట‌.


��

మంచి న‌టుడే అయినా.... దాన్నిపూర్తి స్థాయిలో బ‌య‌ట‌పెట్టే అవ‌కాశం నాగ‌బాబుకి రాలేదు. 1000 అబ‌ద్ధాలు మాత్రం ఆ ఛాన్స్ క‌ల్పించింది. మ‌రి నాగ‌బాబు ఏమేర‌కు రెచ్చిపోయాడో తెలియాలంటే 1000 అబ‌ద్ధాలు సినిమా రావాల్సిందే. తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సాయిరామ్ శంక‌ర్‌, ఏస్త‌ర్ జంట‌గా న‌టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: