తెలుగు, తమిళ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రభుదేవ ‘ప్రేమికుడు’ చిత్రంతో హీరోగా మారారు.  టాలీవుడ్, కోలీవుడ్ మైకేల్ జాక్సన్ గా పేరొందిన ప్రభుదేవ కొరియో గ్రాఫర్ సుందరం మాస్టార్ కుమారుడు.  నటుడిగా, దర్శకుడిగా కూడా నిరూపించుకున్నాడు. తెలుగులో డైరెక్ట్ గా నటించినవి కొన్ని చిత్రాలే అయినా డబ్బింగ్ సినిమాల ద్వారా, చుక్ బుక్ చుక్ బుక్ రైలే... పాటతో తెలుగు ప్రేక్షకులూ తమ వాడిని చేసుకున్నారు. ఇక ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా...’ సినిమాతో దర్శకత్వంలోనూ తన టాలెంట్ నిరూపించుకుని, కొన్ని బాలివుడ్ చిత్రాలకూ దర్శకత్వ బాధ్యతలను అందిపుచ్చుకుని, అక్కడే సెటిలైపోయాడు.
Image result for ntr dance
 ఇటీవల గూగుల్ సెర్చ్ లో ఇండియన్ బెస్ట్ డ్యాన్సర్ ఎవరయ్యా అంటే ... యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు నెటిజన్లు.  ఈ విషయం పై ప్రభుదేవ మాట్లాడుతూ..డౌటే లేదు ఎన్టీఆర్ అద్భుత డ్యాన్సర్ , అతడి ఎనర్జీ లెవల్స్ సూపర్బ్ అంటూ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించాడు ప్రభుదేవా.  ఒకప్పుడు డ్యాన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రభుదేవ గత కొంత కాలంగా దర్శకత్వం,నటనపైనే శ్రద్ద చూపిస్తున్నారు.
Image result for ntr dance
ఇక ఎన్టీఆర్ మొదట్లో కాస్త బొద్దుగా ఉన్నా డ్యాన్స్ తో మెప్పించేవారు..ఇక ‘యమదొంగ’ చిత్రం తర్వాత మనోడు సన్నగా మారడం డ్యాన్స్ తో అదరగొట్టడం జరుగుతుంది.  ఇటీవల గూగుల్ రిలీజ్ చేసిన లిస్ట్ లో ఎన్టీఆర్ నెంబర్ వన్ డ్యాన్సర్ గా మార్కులు కొట్టేయగా చిరంజీవి నెంబర్ 10 లో ఉన్నాడు . ఇక ప్రభుదేవా మాత్రం టాప్ టెన్ లో స్థానం దక్కింది.


మరింత సమాచారం తెలుసుకోండి: