టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న ప్రిన్స్ మహేష్ బాబు ప్రజెంట్ సుకుమార్ డైరెక్షన్లో 1 అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ స్టార్ట్ అయి చాలా కాలం అవుతోంది. కాని ఇంకా మరింత టైం పట్టేట్లు ఉంది. దీనికి కారణం పలానా అని చెప్పలేం కానీ మంచి అవుట్ పుట్ కోసమే ఇంత సమయం తీసుకుంటున్నామని నిర్మాత అనిల్ సుంకర ఈ మధ్య ఓ ఫంక్షన్లో చెప్పుకొచ్చాడు.


ఎంత వేస్ట్ అయినా మూవీ విడుదల అవుతుందని ఓ క్లారిటీ అయితే ఉంది. కానీ, మహేష్ తదుపరి ప్రాజెక్ట్ గురించే సరైన క్లారిటీ దొరకడం లేదు. ఎందుకంటే క్రిష్ డైరెక్షన్లో మహేష్ బాబుతో శివంలో నటిస్తున్నానని బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఒక వైపు చెప్పుకుంటుంటే, మరో వైపు ఎవడు మూవీ చేస్తున్న వంశీ పైడిపల్లితో మహేష్ మూవీ కన్ఫర్మ్ అయిందని మరో వైపు వినిపిస్తుంది. ఇదిలా ఉంటె ఇంకో వైపు శ్రీను వైట్ల, మహేష్ బాబుతో ఎప్పుడు ఆగ(డు)కుండా ఉండేలా షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నాడు.


మరి ఇంత గందరగోళంలో మహేష్ 1 తరువాత అసలు ఏ మూవీ చేస్తున్నాడు అనే డౌట్ రావడం సహజం. సో అందుకే మహేష్ సినిమాల గురింఛి ఓ క్లారిటీ కావాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. మరి అభిమానుల కోసమైనా ప్రిన్సు ట్విట్టర్ పేజిలో దీనిపై ఒక్క ట్విట్ చేస్తే పోలా?

మరింత సమాచారం తెలుసుకోండి: