హీరో సిద్దార్ద్ క్యూట్ గర్ల్ సమంతల ప్రేమ బందం మూడు ముళ్ళ బందంగా మారడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటిస్తున్న సమంత నిజజీవితంలో తన అత్తారింటికి దారి తెలుసుకుని వాళ్ళింటికి వెళ్ళి వారిని ప్రసన్నం చేసుకుందట.

అసలు విషయం ఏమిటంటే హీరో సిద్దార్ద్ తన సూపర్ హిట్ మూవీ ‘బొమ్మరిల్లు’ సినిమాలో జెనీలియా చేసిన నటనను సమంత చేత తన ఇంటిలో నటింప చేసేడట. సిద్దూ ప్రోత్సాహంతో సమంత కాబోయే తన అత్తారింటికి వెళ్ళి తన అత్తగారితో తెగ కబురుల్లు చెప్పిందట. తాము ఎంత ఘాటుగా ప్రేమించుకుంటోందీ, అసలు తమ మధ్య ప్రేమ ఎలా ప్రారంభమైంది లాంటి అనేక విషయాలు వివరించిందట. సమంత మాటలకు ఫ్లాట్ అయిపోయిన సిద్దూ తల్లి, మీ పెళ్ళికి లైన్ క్లియర్ అందట.

దాంతో హ్యాపీ మూడ్ లోకి వెళ్ళిపోయిన సిద్దార్ద్ తను ఈ మధ్య నటించిన ‘సంధింగ్ సంధింగ్’ సినిమాలో హాన్సిక కంటే సమంతే బాగా నటించింది అంటూ భారీ స్టేట్ మెంట్స్ కూడా వదిలేసాడట. ఇక మన సిద్దూ కూడా సమంత ఇంటికి వెళ్ళి వాళ్ళమ్మా, నాన్నలను ఒప్పిస్తే ఇక పెళ్ళి అయిపోయినట్లే. అన్నీ కుదిరితే ఈ డిసెంబర్ లోనే పెల్లిపీటలు ఎక్కుదామని ప్లాన్ చేసుకుంటున్నారట సమంతా సిద్దార్ద్ లు...

మరింత సమాచారం తెలుసుకోండి: