నాగార్జున కింగ్ సినిమాలో త్రిష పాటను ఉద్దేశించి న్యాయనిర్ణేతగా వచ్చి బ్రహ్మానందం చేసిన కామెడీ ఇప్పటికి గుర్తు ఉంటుంది. “ మేం ఎక్కడికో తీసుకెలదాం అనుకుంటాం. మీరు అక్కడికి రారు,” అంటూ ఆ సినిమాలో బ్రహ్మి పలికిన మాటలు రీసెంటుగా అతను అటెండ్ అయిన అంజనా సౌమ్య ఆల్బం లాంచ్ ఈవెంటులో విన్పించినట్లుగా అనిపించింది. అదీ బ్రహ్మి వాయిస్ లోనే.


అంజనా సౌమ్యని చూడగానే నాకు జానకమ్మ గుర్తొస్తుంది. ఏకాగ్రత ఉన్న సింగర్ అంజనా. మాములు పాటలే అలా పాడిందంటే ఈ భక్తి ఆల్బం ఇంకా బాగా పాడి ఉంటుందని, చాలా జాగ్రతలు తీసుకొని ఉంటుందని, నిజంగా గాయనిగా పుట్టడం ఎంతో అదృష్టం అని సినిమా డైలాగ్స్ లెవెల్లో మాట్లాడటమే కాదు తన స్టైల్లో నాలుగు పంచులు వేసి పక పక నవ్వించాడు బ్రహ్మీ!


బ్రహ్మి ఇచిన స్పీచుని విని, పంచులకు నవ్వుకున్న ఆడియన్స్ మాత్రం కింగ్ సినిమాలో లాగా అంజనా పాటలను జడ్జ్ చేయడానికి వచ్చాడా బ్రహ్మి అని అనుకోవడం అక్కడ విశేషం. ఏమైనా బ్రహ్మి ఉంటే బ్రహ్మానందమే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: