దర్శకుడు తేజ తాను మనసులో అనుకున్నది నిర్మొహమాటంగా బయటకు చెప్పేస్తాడు. ఒక విధంగా అతను పెద్దగా ఎదగలేకపోవడానికి కూడా కారణం ఇదే అంటారు. పూరి జగన్నాద్ తమ్ముడు, సాయిరాం శంకర్ ను హీరో గా చేసి ప్రస్తుతం తేజ “1000 అబద్ధాలు” ఆడిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆశక్తికర విషయాలు నిన్న తేజ మీడియా కు వెల్లడించాడు.

సాయిరాం శంకర్ తో తనను సినిమా చేయవద్దని చాలామంది సలహా ఇచ్చారని, ఎవరైనా ఏదైనా వద్దు అని చెపితే, ఆ పని చేయడంలో తనకు థ్రిల్ ఉంటుందని, అందుకనే సాయిరామ్ శంకర్ నే హీరోగా పెట్టి ఈ సినిమా చేశానని చెప్పుకొచ్చాడు తేజ. పెళ్ళి అంటే నూరేళ్ళ పంటా అంటారు. దాని కోసం 1000 అబద్ధాలు ఆడి అయినా సరే ఒక పెళ్ళి చేయమంటారు. ఇంతకీ ఈ 1000 అబద్ధాలు ఆడింది అమ్మాయా..? అబ్బాయా..? అన్నది మాత్రమే సస్పెన్స్ అని చెపుతూ, కామెడీ తో కలిసి పోయిన లవ్ ట్రాక్ ఈ సినిమా కధ అని వివరించడమే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పుడో మర్చిపోయిన రమణ గోగుల ను ఈ సినిమా ద్వారా మళ్ళి రి-ఎంట్రీ చేయిస్తున్నానని చెప్పుకొచ్చాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్.

“నిజం” చెప్పమంటే ప్రేక్షకులకు నచ్చలేదు కాబట్టి ఇప్పుడు “1000 అబద్ధాలు” ఆడిస్తున్నాను అదైనా నచ్చుతుందేమో అనే ఆశాభావాన్ని తేజ వ్యక్తపరచారు. కొన్ని సంవత్సరాల క్రితం సినిమా పోస్టర్ పై తేజ పేరు ఉంటే చాలు, జనాలు వెళ్ళిపోయే పరిస్థితులలో ప్రస్తుతం తన ప్రభావాన్ని కోల్పోయిన తేజ అబద్ధాలు ప్రేక్షకులకు నచ్చుతాయా..? అన్నదే ప్రశ్న.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: