త‌మిళ‌నాట త్రిష‌, అమ‌లాపాల్ మ‌ధ్య ర‌స‌వ‌త్త‌రమైన పోటీ న‌డుస్తోంది. త్రిష చేయాల్సిన సినిమాల్ని అమ‌లాపాల్ లాక్కుంటోంది. అమ‌లా ప్లేసులోకి త్రిష వ‌స్తోంది. ధ్రువ న‌క్ష‌త్రం సినిమా విష‌యంలోనూ ఇంతే. సూర్య క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న చిత్ర‌మిది. గౌత‌మ్ వాసుదేవ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ చిత్రంలో క‌థ‌నాయిక స్థానం త్రిష‌-అమ‌లాపాల్‌ల మ‌ధ్య దోబూచులాడుతోంది.

తొలుత ఈ సినిమా అమ‌లాపాల్‌ని నాయిక‌గా ఎంచుకొన్నారు. త‌ర‌వాత త్రిష వ‌చ్చింది. ఇప్పుడు మ‌ళ్లీ ఆ ప్లేస్ అమ‌లాపాల్‌కే ద‌క్కింది. సూర్య ప‌క్క‌న ఛాన్స్ అంటే మాట‌లు కాదు. అటు త‌మిళంలోనూ, ఇటు తెలుగులోనూ సినిమా విడుద‌ల అవుతుంది. సినిమా బాగా ఆడితే మార్కెట్ పెంచుకోవ‌చ్చు. అందునా గౌత‌మ్ మీన‌న్ సినిమా అంటే క‌థానాయిక పాత్ర‌కు ప్రాముఖ్యం ఉంటుంది. ఆ ఛాన్స్ త్రిష తృటిలో కోల్పోయింది.

��
నాయ‌క్ సినిమా విజ‌య‌వంత‌మైనా, ఆ స్థాయిలో అవ‌కాశాలు అందుకోలేక‌పోయింది అమలా. ఇద్ద‌ర‌మ్మాయిల‌తో సినిమాలో బాగా న‌టించినా - ఆ సినిమా ఫ్లాప్ అవడంతో కొన్ని అవ‌కాశాలు వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి చేజారిపోయాయి. చేజారిపోయింది అనుకొన్న ఈ ఛాన్స్ మ‌ళ్లీ అందుకోవ‌డం అంటే అమ‌లా ల‌క్కీనే.

మరింత సమాచారం తెలుసుకోండి: