రామ్‌చ‌రణ్ కేసు మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. గ‌త‌నెల‌లో న‌డిరోడ్డుపై ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను త‌న మ‌నుషుల‌తో చిత‌గ్గొట్టించాడు - అనే వ‌ర్త‌తో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం సృష్టించాడు రామ్‌చ‌ర‌ణ్‌. ఆ సంఘ‌ట‌న‌కు సంబంధించిన ఫుటేజులు కూడా దొరికాయి. అయితే చ‌ర‌ణ్ మాత్రం ఆ స‌మ‌యంలో నేను అక్క‌డ లేను... అని బుకాయించాడు.

అప్పుడు క్లోజ్ స‌ర్క్యూట్ కెమెరాల్లో చ‌ర‌ణ్ మొహం క‌నిపించినా అది మార్ఫింగ్ అని వాదించాడు. కేసు పోలీస్ స్టేష‌న్‌కి వెళ్లినా త‌న ప‌లుకుబ‌డి ఉప‌యోగించి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. ఇప్పుడు మాన‌వ‌హ‌క్కుల సంఘం చొర‌వ‌తో మ‌ళ్లీ ఆ కేసు బ‌య‌ట‌కు వ‌చ్చింది. దానితో పాటు ఆ స‌మ‌యంలో చ‌ర‌ణ్ అక్క‌డే ఉన్నాడు అనే నిజాలూ వెలుగులోకి వ‌చ్చాయి. అవి చ‌ర‌ణ్ ఫొటోలే అని మాన‌వ హ‌క్కు ల సంఘం ప్రాధ‌మిక నిర్థార‌ణ‌లో తేలింది.

��
మ‌రి చ‌ర‌ణ్ ఎందుకు బుకాయించాడు?  దొరికి పోతా... అని తెలిసినా ఎందుకు అబ‌ద్ధాలు ఆడాడు?  తాను ఏం చెప్పినా చెల్లుతుంది అనే క‌దా?  మ‌రి మానవ హ‌క్కుల క‌మీష‌న్ చ‌ర‌ణ్‌పై ఎలాంటి చ‌ర్య తీసుకొంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: