తెలుగు,తమిళ, హిందీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన చిత్రం ‘బాహుబలి’. దర్శకధీరుడు రాజమౌళి రెండు సంవత్సరాలు సుదీర్ఘంగా కష్టపడి తెరకెక్కించిన విజువల్‌ వండర్‌ ‘బాహుబలి’. ఇప్పటి వరకు తెలుగు తెరపై ఎన్నో జానపద చిత్రాలు వచ్చాయి..కానీ ‘బాహుబలి’ లాంటి విజువల్ ఎఫెక్ట్ తో ఉన్న చిత్రం రాలేదు.  ఈ చిత్రంతో ప్రపంచంలో తెలుగోడి సత్తా చాటారు రాజమౌళి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో రికార్డులు సృష్టించింది.  ఇక ఈ చిత్రం షూటింగ్ మొదలు కలెక్షన్ల వరకు రాజమౌళి క్రియేట్ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.  

Image result for baahubali 2

సినిమా ప్రమోషన్..సోషల్ మీడియాలో ప్రచారం ఇలా అన్ని రకాలు గా సినిమాపై అంచనాలు పెంచారు.  అంతే కాదు బాహుబలి రూ.600 కోట్ల కలెక్షన్లు వసూళ్లు చేయడమే కాకుండా..జాతీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికైంది.  ప్రస్తుతం రాజమౌళి ‘బాహుబలి 2’ చిత్రం షూటింగ్ లో నిమగ్నమయ్యారు.  త్వరలో ఈ షూటింగ్ పూర్తి చేసుకొని అభిమానుల ముందుకు రాబోతుంది.  తాజాగా ఈ చిత్రంలో హిందీ వర్షన్ లో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

Image result for baahubali shahrukh khan

దీనిపై స్పందించిన రానా బాహుబలి..ది కంక్లూజన్‌లో షారుఖ్ ఖాన్ నటించడం లేదు. బాహుబలి ప్రపంచం పూర్తిగా భిన్నమైనది. ఈ ప్రాజెక్టులో ఎలాంటి ప్రత్యేక పాత్రలుండవని రానా స్పష్టం చేశాడు. అంతే కాదు ఆ మద్య సూర్య, మోహన్‌లాల్‌ను సంప్రదించినట్లు వచ్చిన వార్తలు నిజం కావు. ఈ సినిమాలో అలాంటి ప్రత్యేక పాత్రలేమీ లేవని చెప్పాడు రానా. ప్రభాస్, రానా, అనుష్క లీడ్ రోల్స్‌లో వస్తున్న బాహుబలి 2 ఏప్రిల్ 28న విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: