ఏ ముహూర్త‌న సాహ‌సం మొద‌లెట్టారో గానీ, ఆ సినిమా విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఈ సినిమా ఎప్పుడో పూర్త‌యింది. అయితే విడుద‌ల తేదీ మాత్రం కోర్టు వాయిదాల‌ను త‌ల‌పిస్తోంది. ముందు ఈ సినిమాని వేస‌వికి తీసుకురావాలి అనుకొన్నారు. పెద్ద సినిమా హంగామా, ఐపీఎల్ ఉండ‌డంతో వెన‌క్కి వెళ్లింది.

మే 30న తీసుకొద్దామ‌నుకొన్నారు.. ఇద్ద‌ర‌మ్మాయిల‌తో వ‌స్తుందని ఆగారు. ఆ త‌ర‌వాత జూన్ 21 అన్నారు. అప్పుడూ మ‌రో స‌మ‌స్య వ‌చ్చింది. జులై 5న ప‌క్కాగా వ‌చ్చేస్తున్నాం అని చెప్పారు. అయితే అదే రోజు సూర్య సినిమా సింగ‌మ్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఆ సినిమా పెద్ద ఎత్తున థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నారు. దాంతో సాహ‌సం సినిమాకి థియేట‌ర్లు దొర‌క‌లేదు. సూర్య సినిమాతో పోటీగా వెళ్ల‌డం ఎందుకు?  అని నిర్మాత‌లు కూడా వెన‌క్కి వెళ్లారు.

��

ఇప్పుడు జులై 15కి విడుద‌ల తేదీ మారింది. మ‌రి అప్పుడైనా వ‌స్తుందా? ఏమో మ‌రి ఎవ‌రికి ఎరుక‌. చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో తాప్సి క‌థానాయిక‌గా న‌టించింది.మొగుడు త‌ర‌వాత గోపీచంద్‌-తాప్సి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్ర‌మిదే.

మరింత సమాచారం తెలుసుకోండి: