దేవదాసు సినిమా విడుదల అయి నేటికి 60 సంవత్సరాలు పూర్తి అయి తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటికీ ఒక క్లాసిక్ గానే మిగిలిపొయింది. అయితే దేవదాసు పాత్రలో జీవించిన అక్కినేని, ఆ సినిమాలోని దేవదాసు పాత్ర కోసం చాలా హోం వర్క్ చేశారు. ఈ సినిమాలో నటించే ముందు ఈ సినిమా నవల ను రాసిన శరత్ పుస్తకాలను తెలుగులో లభించినంతవరకూ అన్నీ చదివారట. అంతేకాకుండా శరత్ దేవదాసు నవలపై తనకున్న అనుమానాలను అక్కినేని అప్పటి రచయితలు చాలామందిని కలిసి దేవదాసు పాత్ర విశ్లేషణ పై చాలా చర్చలు జరిపే వారట. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, దేవదాసు పాత్రకు ఎంపిక అయిన అక్కినేని కి తాగుడు అంటే తెలియదట. కాని ఆ పాత్ర పచ్చి తాగుబోతు పాత్ర. తాగుడు విషయం పెద్దగా తెలియని అక్కినేని, ఈ తాగుబోతు పాత్ర ఎలా పోషించాలా..? అని మధన పడి పోయేవాడట. తను సినిమాలలోకి వచ్చే ముందు మద్యం జోలికీ, మిగతా వ్యసనాల జోలికి వెళ్లనని అక్కినేని తల్లి కి మాట ఇచ్చారట. ఈ పాత్ర కోసం తల్లికిచ్చిన మాట ఒదులుకోవడం అక్కినేని కి ఇష్టం లేదు. కాని పచ్చి తాగుబోతులా నటించాలి.

అందుకే తనకు తాగుడు అలవాటు లేకపోయినా, ఈ సినిమా కోసం మద్యానికి బానిసలు అయిన చాలామంది వ్యక్తుల మధ్య తిరుగుతూ మద్యం తాగిన తరువాత వారి ముఖ కవలికలో వచ్చే మార్పులను అక్కినేని చాలా నిశితంగా పరిశీలించే వారట. ఈ సినిమా దర్శకుడు వేదాంతం రాఘవయ్య కు మద్యం తాగే అలవాటు ఉండేదట. అందుకే ఆయనతో పాటు అక్కినేని ఏరికోరి మందు పార్టీలకు వెళ్ళేవారట. అంతేకాదు అలనాటి తెలుగు పరిశ్రమ దిగ్గజాలు అయిన నాగిరెడ్డి, చక్రపాణి, కెవి.రెడ్డి ల మందు పార్టీలకు కూడా వెళ్ళి వాళ్ళను అబ్సర్వ్ చేసే వాడట. ఇలా తను చేసిన రీసెర్చ్ తో అక్కినేని ఈ పాత్రను పోషించి, జీవించాడు. ఈ సినిమా విడుదల అయి సూపర్ హిట్ అయ్యాక, చాలామంది ప్రేక్షకులు అక్కినేని నిజంగానే తాగుబోతు అయిఉంటాడు..? లేకుంటే ఇంత సహజంగా ఎలా నటిస్తాడు అని కామెంట్స్ చేశేవారట. అంతేకాదు ఆరోజులలో అక్కినేని అభిమానులు అనేకమంది “దయచేసి మీరు తాగకండి..తాగితే మీ ఆరోగ్యం దెబ్బ తింటుంది..”అంటూ ప్రాధేయ పూర్వకంగా కొన్ని వందల ఉత్తరాలు వచ్చేవట.

అంతేకాదు దేవదాసు పాత్రలో అక్కినేని అంతబాగా చేయడానికి 10 రోజులు అన్నం మానేసి, నీరసించి పోయి షూటింగ్ కి వచ్చేవాడు అనే పుకార్లు ఆరోజులలో వచ్చాయట. కాని అక్కినేని మాత్రం ఏనాడూ షూటింగ్ కు ముందు ఖాళీ కడుపుతో వెళ్ళలేదట. అంతేకాదు తనకు ఎంతో ఇష్టం అయిన మీగడ పెరుగు అన్నం తిని రాత్రి పూట షూటింగ్ కి వెళ్ళేవాడట. దేవదాసు సినిమా అంతా కూడా చాలా మటుకు రాత్రి పూటే చిత్రికరించారట. అందువల్ల రాత్రి షూటింగ్ లో పాల్గొని పగలు పూట పడుకొనే వాడట అక్కినేని. మరొక ఆశక్తికర విషయం ఏమిటంటే మొదటగా దేవదాసు లో పార్వతీ పాత్రకు భానుమతి, షావుకారు జానకి లను అనుకోని వారి డేట్స్ కుదరట పోవడంతో అప్పటికి చిన్న చిన్న వేషాలు వేస్తున్న సావిత్రి ని ఎంపిక చేశారట. ఇలా ఎన్నో నమ్మలేని నిజాలు, ఆశక్తికర విషయాలు ఈ సినిమాకు సంబంధించినవి ఉన్నాయి. అందుకే దేవదాసు సినిమా ఒక చరిత్ర. తెలుగు సినిమా బ్రతికిఉన్నంత కాలం దేవదాసు బ్రతికే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: