శాస్త్రీయ సంగీతం, నృత్యం లేకుండా విశ్వనాద్ సినిమా తీయలేరు. పూలు- పండ్లు, కాయలు లేకుండా రాఘవేంద్రరావు పాటలు తియ్యలేడు. అలాగే తెలుగు సినిమా జక్కన్న రాజమౌళి రకరకాల డిజైన్ లతో కూడిన ఆయుధాలు లేకుండా సినిమాలు తియ్యలేడు. “సింహాద్రి” లో ఎన్టిఆర్ కూ, “ఛత్రపతి” లో ప్రభాస్ కూ, “మగధీర” లో రామ్ చరణ్ కు రకరకాల ఆయుధాలు ఇచ్చి, ఆ సినిమాలను సూపర్ హిట్ చేశాడు రాజమౌళి.

 ప్రస్తుతం ప్రభాస్ తో రాజమౌళి తీస్తున్న బాహుబలి సినిమా షూటింగ్ ఆలశ్యానికి ఈ ఆయుధాల డిజైనింగ్ ఆలశ్యం కావడమే అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు, రాజమౌళి బాహుబలి సినిమాకు సంభందించిన స్క్రిప్ట్ పూర్తి చేసినా, సెట్టింగ్ లు రెడీ అయి పోయినా, హీరో ప్రభాస్, విలన్ రానా లు ఉపయోగించే ఆయుధాల డిజైనింగ్ రాజమౌళి కోరుకున్న విధంగా తయారు కాలేదట. 100 కోట్ల భారీ బడ్జెట్ సినిమా కాబట్టి ఈ సినిమాలో హీరో – విలన్ ఉపయోగించే ఆయుధాల విషయంలో కూడా చాలా ప్రత్యేకంగా ఉండాలని రాజమౌళి ఆలోచన అట. అందుకే దేశవ్యాప్తంగా పేరున్న రకరకాల డిజైనర్స్ దగ్గరనుంచి ఈ ఆయుధాల డిజైన్స్ వేయి౦చి, కొన్ని నమూనాగా కూడా తయారు చేయి౦చి, వాటితో ప్రభాస్ రానా ల మధ్య యుద్ధ సన్నివేశాలను ట్రైల్ షూట్ చేస్తున్నాడట రాజమౌళి.

 కాని ఈ ఆయుధాల డిజైనింగ్ లో ఏదో చిన్న చిన్న లోపాలు కనిపించడంతో మరలా మళ్ళి మళ్ళి డిజైన్ చేయిస్తున్నాడట ఈ జక్కన్న. మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ గా పేరున్న రాజమౌళి ఈ సినిమా పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు కొందరికి ఆశ్చర్యం కలిగిస్తుంటే ప్రభాస్-రానా లు మాత్రం ఈ ఆయుధాల డిజైనింగ్ త్వరగా పూర్తి అయి, షూటింగ్ మొదలు అయితే బాగుండును అని అనుకుంటూ దణ్ణం పెట్టుకుంటున్నారట. దట్ ఇస్ రాజమౌళి...
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: