ప్రేమ క‌థా చిత్రమ్‌తో తొలి విజ‌యాన్ని అందుకొన్నాడు కృష్ణ మేన‌ల్లుడు సుధీర్‌బాబు. ఇప్పుడు మాయిదారి మ‌ల్లిగాడుగా ముస్తాబ‌వుతున్నాడు. కృష్ణ న‌టించిన సూప‌ర్ హిట్ సినిమా టైటిల్ ఇది. ప్రేమ‌కథా చిత్రమ్‌లో కృష్ణ పాట (వెన్నెలైనా చీక‌టైనా - ప‌చ్చని సంసారం) వాడుకొన్న అల్లుడు ఇప్పుడు ఏకంగా కృష్ణ టైటిల్ పెట్టేసుకొన్నాడు.

హ‌నుమాన్ ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా బుధ‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. కృష్ణ త‌న స్వహ‌స్తాల‌తో ఈ సినిమాకి క్లాప్ కొట్టి అల్లుడిని ఆశీర్వదించారు. ''గేమ్ విన్ అవ్వాలంటే మైండ్‌లో టార్గెట్ ర‌న్ అవ్వాలి'' అనే డైలాగ్‌ని ఓపెనింగ్ షాట్‌గా తీశారు. ''మావ‌య్య పేరు వాడుకొన్నప్పటికీ, పాత సినిమాకీ దీనికీ పోలిక‌లు ఉండ‌వు...'' అని చిత్రబృందం చెబుతోంది. వ‌చ్చే నెల 10 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంది.


��
''నేను సైనింగ్ మూడ్‌లో ఉన్నాన‌ని, వ‌రుస‌గా సినిమాలు ఒప్పుకొని... డ‌బ్బులు చేసుకొనేందుకు చూస్తున్నాన‌ని కొన్ని వెబ్ సైట్లు రాశాయి. అయితే నేను డ‌బ్బు మ‌నిషిని కాదు. డ‌బ్బులొస్తున్నాయి క‌దా... అని సినిమాలు ఒప్పేసుకోను. మ‌న‌సుకు న‌చ్చిన సినిమాలే చేస్తా'' అంటున్నాడు సుధీర్ బాబు.



మరింత సమాచారం తెలుసుకోండి: