ప్రకాష్ రాజ్ నటన మాత్రమే కాదు అతని వ్యక్తిగత జీవితం కూడా విలక్షణం. అతడు ఏం చేసినా ప్రత్యేకంగా ఉండేట్టుగానే చేస్తాడు. ఆ మధ్యన ఒక ప్రతిస్టాత్మకమైన అవార్డు వస్తే ఆ అవార్డును తిరస్కరించాడు. ఒక సినిమాలో తన పాత్రకు వేరే వాళ్ళ చేత డబ్బింగ్ చెప్పిస్తే ఆ సినిమా దర్శక నిర్మాతల పై ఫైర్ అయిపోయాడు. అంతేకాదు తను చెప్పాలనుకున్నది చెపుతాడు, చెయ్యాలిఅ నుకున్నది చేస్తాడు అదే అతడి స్పెషాలిటి.

ప్రస్తుతం ఈ విలక్షణ నటుడు ఒక పాత్ర తనుకు నచ్చిందని ఆ సినిమా నిర్మాతను ఎటువంటి పారితోషకం అడగ కుండా ఫ్రీ గా చేస్తున్నాడు. అద్లెట్ మిల్కాసింగ్ జీవితం ఆధారంగా బాలీవుడ్ లో రూపొందుతున్న ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమాలో మిల్కా సింగ్ కు గురువుగా నటించే పాత్ర ప్రకాష్ రాజ్ కు వచ్చింది. ఈ పాత్ర స్వభావం నచ్చడంతో ప్రకాష్ రాజ్ ఆ సినిమా దర్శక నిర్మాతలతో ఇటువంటి పాత్ర చేయడం తన అదృష్టం అని చెపుతూ తనకి పారితోషికంగా ఒక్క రూపాయి కూడా వద్దన్నాడు .

ఇదే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సోనమ్ కపూర్ కు ఈ సినిమా నిర్మాతలు పదకుండు కోట్లు పారితోషికంగా ఇస్తున్నారన్న విషయం తెలిసి కూడా ప్రకాష్ రాజ్ ఇలా ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్య పరిచింది. దీనితో ఈ సినిమా దర్శక నిర్మాతలు ఆనంద పడుతున్నారట. అంతేకాదు ఆ చిత్ర యూనిట్ అంతా ప్రకాష్ రాజ్ ను పొగడ్తలతో ముంచేత్తుతున్నారట. బహుసా ఆ సినిమా నిర్మాతకు మనవాడి  గురించి తెలియదనుకుంటా...

 

మరింత సమాచారం తెలుసుకోండి: