మ‌న‌కున్న ద‌ర్శకుల్లో మ‌హా మొండి ద‌ర్శకుడు తేజ‌. ఒక‌రు చెప్పింది ఆయ‌న చేయ‌రు. ఆయ‌న‌కు న‌చ్చిందే చేస్తారు. త‌న విష‌యాల్లో వేలు పెడ‌తారనే భ‌యంతోనే స్టార్ హీరోల‌తో సినిమాలు చేయ‌డానికి సాహ‌సించరు. చెప్పింది చెప్పిన‌ట్టు చేస్తార‌ని కొత్తవాళ్లనే ఎంచుకొంటారు. ఆయ‌న ఎంత మొండివాడో... ఆయ‌నే చెప్పుకొచ్చారు ఇలా.

తేజ ద‌ర్శక‌త్వంలో 1000 అబ‌ద్దాలు అనే సినిమా తెర‌కెక్కింది. ఇందులో సాయిరామ్ శంక‌ర్ ని హీరోగా ఎంచుకొన్నారు. సాయితో ఈ సినిమా చేయాలా? వ‌ద్దా అని తేజ దీర్ఘంగా ఆలోచిస్తున్నప్పుడు ''ఏంటీ?  సాయిరామ్ శంక‌ర్‌తో సినిమా తీస్తున్నావట క‌దా?  వ‌ద్దు... మానేయ్‌..'' అని చాలామంది స‌ల‌హా ఇచ్చార‌ట‌. వేరే హీరోని వెదుక్కోమ‌ని హిత‌బోధ చేశార‌ట‌. ``వీళ్లు నాకే స‌ల‌హాలు ఇస్తారా?` అని తేజ ఈగో హ‌ర్టయి... ఈ సినిమా తీస్తే గీస్తే సాయితోనే చేయాల‌ని ఆక్షణంలో గ‌ట్టిగా డిసైడ్ అయ్యార‌ట తేజ‌. ఈ విష‌యం ఆయ‌నే చెప్పారు.

��

మొండిత‌నం మంచిదే. తెగువ‌తో ధైర్యంగా ముంద‌డుగు వేయ‌వ‌చ్చు. ఇప్పుడు తేజ చేసింది అక్షరాలా అదే. మ‌రి ఈ మొండిత‌నం ఆయ‌న‌కు విజ‌యాన్ని తీసుకొస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: