స్టార్లు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే. అందునా బాలీవుడ్ స్టార్ల క్రేజ్ కి అంతు ఎక్కడిది??  తెలుగులో ఒక్క సినిమాకి ప‌ది కోట్ల పారితోషికం తీసుకొంటున్నారంటే అమ్మె అంటున్నారు. కానీ... స‌ల్మాన్ లాంటి స్టార్ హీరో ఒక సంస్థకు ప్రచార క‌ర్తగా వ్యవ‌హ‌రించ‌డానికి ఏకంగా రూ.20 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. స‌ల్మానా... మ‌జాకా?

కొత్తగా త‌న వ్యాపారాన్ని ప్రారంభించిన సిమెంట్ కంపెనీ... స‌ల్మాన్‌ని ప్రచార‌క‌ర్తగా నియ‌మించుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతోంది. దాని కోసం స‌ల్మాన్ ని సంప్రదిస్తే రూ.20 కోట్లు డిమాండ్ చేశాడ‌ట‌. దాంతో ఆ సిమెంట్ కంపెనీ దిమ్మ దిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది.


��

నా పేరు, బ్రాండ్ వాళ్లు వాడుకోవాల‌ని చూశారు. అందుకే అంత అడిగా. త‌ప్పేముంది అంటున్నాడు స‌ల్మాన్. ఆయ‌నొక్కడే కాదు. అమీర్‌, షారుఖ్, అజ‌య్ దేవ‌గ‌ణ్ వీళ్లంతా కోట్లు డిమండ్ చేస్తున్నారు. కొత్తగా స్టార్ హోదా ద‌క్కించుకొన్న ర‌ణ‌బీర్ క‌పూర్ కూడా పైసా త‌గ్గడం లేదు. మ‌రి స‌ల్మాన్ త‌గ్గుతాడా?

మరింత సమాచారం తెలుసుకోండి: