ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని హీరోల మధ్య కాస్త పోటీ వాతావరణం ఏర్పడిందని చెప్పవచ్చు. గతంలో ఎవరి మూవీలు ఎప్పుడు రిలీజ్ అయినా…వాటి సక్సెస్ కి సంబంధించిన సెలబ్రేషన్స్ అనేవి చాలా కూల్ గా జరిగేవి. గతంలో హీరోల మూవీలకి సక్సెస్ రేటు అనేది చాలా తక్కువ. అందుకే హీరోల మధ్య పోటీ అనేది తక్కువుగా ఉండేది. కానీ ఈ మూడు సంవత్సరాల్లో టాలీవుడ్ లో వస్తున్న మార్పులను చూస్తుంటే….కొత్త దర్శకులు కారణంగా మూవీలకి సంబంధించిన సక్సెస్ రేటు ఒక్కసారిగా పెరిగింది.

దీంతో వరుస ప్లాపులతో ఉన్న హీరోలకి సైతం భ్లాక్ బస్టర్ హిట్స్ వస్తున్నాయి. ప్రతి హీరో హిట్ ని అందుకుంటున్నారు. దీని కారణంగా హీరోల మధ్య వేడి వాతావరణం మ‌ళ్ళీ మొదలైంది. తిరిగి ఇండస్ట్రీలో అసాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చిన్న హీరో సైతం ఏకంగా బ్లాక్ బస్టర్ కొట్టడం…పెద్ద హీరోలు సైతం అంతకు మించి భారీ బ్లాక్ బస్టర్స్ ని అందుకోవటంతో ఎవరు గొప్ప? అనేది ఆ ఇద్దరి హీరోలలో కనిపిస్తున్న ప్రశ్నగా మారింది.

ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో హాట్రిక్ హిట్స్ ని అందుకుంటున్న హీరో రాజ్‌త‌రుణ్…తన సక్సెస్ ల కారణంగా ఏ హీరోని పెద్దగా పట్టించుకోవటం లేదనే టాక్స్ అంతటా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పెద్ద హీరోలతని…యంగ్ హీరోలని లెక్క చేయటం లేదని అంటున్నారు. కొంత మంది హీరోలతో రాజ్‌త‌రుణ్ కొన్ని సందర్భాల్లో చిన్నపాటి గొడవలు సైతం పెట్టుకున్నాడనే టాక్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో ఎప్పటి నుండో యంగ్ హీరోలుగా కెరీర్ ని కొనసాగిస్తున్న వారిని సైతం రాజ్ తరుణ్ లెక్కచేయటం లేదనే టాక్స్ వినిపిస్తున్నాయి.

మొత్తంగా రాజ్‌త‌రుణ్ తన కో స్టార్స్ తో సరైన కమ్యునికేషన్ లో లేకుండా తనదైన స్టైల్ ని చూపిస్తూ ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాడనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తుంది. ఇక మంచు మనోజ్ గుంటూరోడు రిలీజ్‌ను వాయిదా పడటంతో మార్చి 3న ఈ మూవీని  రిలీజ్ చేస్తున్నారు. ఇక అదే రోజు రాజ్‌త‌రుణ్ ది కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త సినిమా కూడా రిలీజ్ అవుతోంది. మ‌రి ఈ ఇద్ద‌రు యంగ్ హీరోలు ఒకే రోజు వారి మూవీలను రిలీజ్ చేసుకోవటం మళ్ళీ పోటీ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: