తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ‘ఇడియట్’ చిత్రంతో దర్శకుడిగా మారిన పూరి జగన్నాధ్ ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించారు.  యూత్ ఫుల్ ఎంట్రటైన్ మెంట్ తో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ సృష్టిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు.    'బద్రి' నుంచి 'ఇజమ్‌' వరకు తన సినిమాల్లోని హీరో క్యారెక్టరైజేషన్‌గానీ, మేనరిజంగానీ డిఫరెంట్‌గా వుండేలా చూసుకుంటూ రెగ్యులర్‌ సినిమాలకు భిన్నమైన సినిమాలను రూపొందించే డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఇప్పుడు మరో డిఫరెంట్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
Displaying image1523.jpg
ఎప్పుడూ కొత్త హీరో, హీరోయిన్లను పరిచయం చేస్తూ వచ్చే పూరి ఈ సారి ఇషాన్ హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.  ఈ సినిమా  లావిషింగ్‌, స్టయిలిష్‌ విజువల్స్‌తో కూడిన ఈ ఫస్ట్‌ లుక్‌కు ఆడియెన్స్‌ నుండి ట్రెమెండస్‌ రెస్పాన్స్‌ రాబట్టుకుంది.  యంగ్‌ హీరో ఇషాన్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ పతాకంపై డా|| సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి నిర్మిస్తున్న 'రోగ్‌'(మరో చంటిగాడి ప్రేమకథ)తో ప్రేక్షకులకు డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వబోతున్నారు డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌.
Displaying image3170.jpg
ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కి వచ్చిన ట్రెమండస్‌ రెస్పాన్స్‌తో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగాయి. ఈరోజు ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న ట్విట్ట‌ర్‌లో మోష‌న్ పోస్ట‌ర్‌ను పోస్ట్ చేశారు. త్వ‌ర‌లోనే రోగ్ చిత్రాన్ని తెలుగు, క‌న్న‌డ‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు సన్నాహాలు చేస్తున్నారు. 

Image result for ROGUE KANNADA MOTION POSTER

ఇషాన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మన్నారా చోప్రా, ఏంజెలా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అనూప్‌సింగ్‌, ఆజాద్‌ ఖాన్‌, పోసాని కృష్ణమురళి, అలీ, సత్యదేవ్‌, సుబ్బరాజ్‌, రాహుల్‌ సింగ్‌, తులసి, రాజేశ్వరి, సందీప్తి తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.రవికుమార్‌, ఆర్ట్‌: జానీ షేక్‌, ఎడిటర్‌: జునైద్‌ సిద్ధిఖీ, మ్యూజిక్‌: సునీల్‌కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌.జి, నిర్మాతలు: సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: