ఒక సినిమా ఇద్దరి హీరోల జీవితాలతో ఆదుకుంది, ఇది యాదృచ్చికమే కావచ్చు కానీ సెంటిమెంట్ రీత్యా చూస్తే నిజమే అనిపిస్తుంది. తమిళంలో విక్రమ్ హీరోగా దాదాపు పదేళ్ళ క్రితం ‘స్వామి’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. అప్పట్లో అది కోలీవుడ్ లో సూపర్ హిట్ ఈ సినిమాను ‘లక్ష్మి నరసింహ’ గా తెలుగులో బాలకృష్ణ హీరోగా రీమేక్ చేసారు. ఆ సినిమా కూడా హిట్ అయింది.

కానీ ఆ సినిమా విడుదలైన తరువాత బాలయ్య కష్టాల్లో పడ్డాడు, తన ఇంటిలో జరిగిన ఒక వివాదంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ ను తన తుపాకీ తో కాల్చాడని పెద్ద సంచలన సంఘటన జరిగింది. దానితో అప్పట్లో మీడియాలో పెద్ద హడావిడి పోలీసు కేసులు కోర్టుల చుట్టూ తిరగడంతో బాలకృష్ణ చాలా కష్టాలు అనుభవించాడు, ఏదోవిధంగా అదృష్టం కొద్దీ ఆ కేసునుండి బయట పడ్డాడు.

 తిరిగి అదే సెంటిమెంట్ బాలీవుడ్ ప్రముఖ హీరో సంజయ్ దత్తు జీవితంలో జరిగింది. ఈ సినిమాను సంజయ్ హీరోగా ‘పోలీసు గిరి’ పేరుతో రీమేక్ చేసారు. ఈ సినిమా షూటింగ్ అవుతున్న సమయంలోనే సుప్రీం కోర్టు సంజయ్ కు ఒక నాటి ముంబాయ్ పేలుళ్ళ సంఘటన పై సంజయ్ పాత్ర గురించి తుది తీర్పు చెప్పి సంజయ్ జైలు శిక్ష ఖరార్ చేసింది. ఇక ఏమి చేసేది లేక కోర్టు ఇచ్చిన గడువులో తన సినిమాలను పూర్తిచేసి ప్రస్తుతం ఎరవాడ జైలులో ఏకాకి జీవితం గడుపుతూ రోజుకో ఉత్తరం తన భార్య మాన్యత కు రాస్తూ ఆధ్యాత్మిక గ్రంధాలు చదువుకుంటూ రోజులు గడుపుతున్నాడు. ఇలా వారిద్దరి జీవితాలతో ‘స్వామి’ సినిమా ఆడుకుంది సెంటిమెంట్ అంటే ఇదేనేమో...

మరింత సమాచారం తెలుసుకోండి: