ప్రముఖ మలయాళ నటి భావన పై లైంగిక వేదింపులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే మాలీవుడ్ ఇండస్ట్రీలో గగ్గోలు పెడుతుండగా ఈ న్యూస్ కాస్త యావత్ భారత దేశం వైరల్ అయ్యింది. దీంతో పోలీసులపై వత్తిడి విపరీతంగా పెరిగిపోయింది.  తాజాగా ప్రముఖ మలయాళ నటి అపహరణ, దాడి కేసులో ప్రధాన నిందితుడు సునీల్ కుమార్ అలియాస్ పల్సర్‌ సుని గురువారం కోర్టులో లొంగిపోయాడు.  అంతకు ముందు కోర్టులో లొంగిపోయేందుకు వెళ్ళిన అతనిని కోర్టుకు వెళ్ళే మార్గంలో పోలీసులు అరెస్టు చేశారు.
Image result for bhavana repoest
నిందితుడు పన్నిన లొంగిపోయే నాటకాన్ని పోలీసులు భగ్నం చేశారు.  నిజానికి కేసు వెలుగులోకి వచ్చి ఆరు రోజులు అవుతున్నా పోలీసులు మాత్రం పల్సర్ సునిని అరెస్టు చేయలేకపోయారు, అతడు ఎక్కడున్నాడో కూడా తెలుసుకోలేకపోయారు. ఇలాంటి పరిస్థితులలో ఈ కేసులో మరో నిందితుడైన విగీష్‌తో కలిసి లొంగిపోయేందుకు సునీ ఏసీజేఎం కోర్టుకు వచ్చాడు. అయితే నిందితుల తరపు న్యాయవాదులను సివిల్‌ దుస్తుల్లో ఉన్న పోలీసులు లాగిపడేశారు. తర్వాత నిందితులను గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.
Image result for bhavana repoest
లొంగిపోవడానికి వచ్చిన నిందితులను బయటకు లాక్కెళ్లి, అరెస్ట్ చేయడంపై డ్యూటీ మేజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేస్తామని సునీల్ తరపు న్యాయవాది తెలిపారు.ముందస్తు బెయిల్ కోసం నిందితులు పెట్టుకున్న పిటిషన్ పై విచారణను కేరళ హైకోర్టు మార్చి 3కు వాయిదా వేసింది. నటిపై దాడి వెనుక సినిమా పరిశ్రమలోని ప్రముఖ నటుడి హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడే సునీల్ ముఠాతో ఈ దారుణం చేయించినట్టు తెలుస్తోంది. ఇక ఫిర్యాదు దాఖలైన అనంతరం ఆరు రోజుల తర్వాత పోలీసులు అతనిని పట్టుకోగలిగారు.



మరింత సమాచారం తెలుసుకోండి: