తెలుగు ఇండస్ట్రీలో ‘అష్టా చమ్మ’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని ఇప్పుడు బిజీ హీరోగా మారిపోయాడు.  వాస్తవానికి మనోడికి గత మూడు సంవత్సరాల క్రితం ‘పిల్ల జమిందార్’ తప్ప వేరే ఏ సినిమా పెద్దగా విజయవంతం కాలేదు.  రెండు సంవత్సరాల క్రితం మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో మనోడి స్టార్ డమ్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది.  గత సంవత్సరం వరుసగా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’,‘జెంటిల్ మాన్’, ‘మజ్నూ’ లాంటి చిత్రాతో హ్యాట్రిక్ కొట్టాడు.  
Image result for hero nani
ఈ సంవత్సరం రిలీజ్ అయిన ‘నేను లోకల్’ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  దీంతో చిన్న నిర్మాతలకు కల్పతరువుగా మారాడు నేచురల్ స్టార్ నాని.  ఇక  నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.3గా నిర్మిస్తున్న చిత్రం పేరు 'నిన్ను కోరి'. ఫిబ్రవరి 24 హీరో నాని పుట్టినరోజు సందర్భంగా నిర్మాత డి.వి.వి.దానయ్య నానికి బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ 'నిన్ను కోరి' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.  ప్రస్తుతం అమెరికాలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ జరుగుతోంది. మార్చి 10 వరకు అమెరికా షెడ్యూల్‌ వుంటుంది. తర్వాత వైజాగ్‌లో జరిగే షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది.  
Related image
నేచురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, ప థ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌, సంగీతం: గోపీసుందర్‌, ఫోటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని, ఆర్ట్‌: చిన్నా, స్టైలింగ్‌: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్‌: లక్ష్మణ్‌ ముసులూరి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి.వి., రచన, దర్శకత్వం: శివ నిర్వాణ.


మరింత సమాచారం తెలుసుకోండి: