తెలుగు ఇండస్ట్రీలో డాక్టర్ సలీమ్, నకిలీ చిత్రాలతో ఎంట్రీ ఇచ్చాడు తమిళ హీరో విజయ్ ఆంటోని.  ఈ రెండు చిత్రాలతో పెద్దగా పేరు రాలేదు కానీ ఆ మద్య రిలీజ్ అయిన ‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగులో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు.  బిచ్చగాడు చిత్రానికి పెట్టిన పెట్టుబడికి నాలుగైదు రెట్లు ఎక్కువ లాభాలు వచ్చాయి. ఆ తర్వాత ‘భేతాళుడు’ చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేక పోయింది.  తాజాగా ‘యమన్’ చిత్రం ఈ రోజు రిలీజ్ అయ్యింది.  
Image result for yaman movie stills
ఈ చిత్రంలో ఆంటోనీ ఓ రాజకీయ నాయకుడిగా కనిపించాడు.  ఇక సినిమా విషయానకి వస్తే రోటీన్ స్టోరీ.. రివేంజ్ స్టోరీ.  ఇక హీరోయిన్ ఇందులో సినిమాల్లో నటించే హీరోయిన్ కావడం మరో విశేషం.  గ్లామర్ పరంగా పెద్దగా లేకపోయినా నటనతో బాగా మెప్పించింది.  ఈ చిత్రం తమిళ డబ్బింగ్ కావడంతో విలన్లు కూడా తమిళతంబీలుగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది..తెలుగు నేచురాలిటీ అస్సలు లేదు.  
Image result for yaman movie stills
అయితే ఈసారి మాత్రం విజయ్ ఆంటోనీ కాస్త పాటల విషయంలో జాగ్రత్త పడ్డాడు.  ఈ చిత్రంలో రెండు మాస్ సాంగులు ఉన్నాయి.  నటన పరంగా విజయ్ ఆంటోనీ చాలా మాస్ గా నటించాడు.  ఏది ఏమైనా ఈ చిత్రం రిజల్ట్ ఎలా ఉంటుందో రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే..ఎందుకంటే ఫస్ట్ డే కలెక్షన్లు బట్టి రిజల్ట్ చెప్పవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: